Inzamam-ul-Haq On Dhruv Jurel Tattoo: శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా ( Sri Lanka vs India, 2nd Test) మధ్య ప్రస్తుతం రెండో టెస్టు జరుగుతోంది. ఇప్పటికే తొలి టెస్ట్ లో విజయం సాధించిన టీమిండియా రెండో టెస్ట్ లోను విజయం దిశగా దూసుకు వెళ్తోంది. అయితే ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా అనే మొదట బ్యాటింగ్ చేయగా… 503 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ప్రస్తుతం శ్రీలంక ఆ తన తొలి ఇన్నింగ్స్ ఆడుతోంది. అయితే మొదటి ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ( Dhruv Jurel ) 115 పరుగులు చేసి దుమ్ములేపాడు. సెంచరీ చేసిన తర్వాత తన కుడిచేతి పైన ఉన్న జై జవాన్, జై కిసాన్ టాటూ ( Dhruv Jurel Tattoo) చూపించి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ సంఘటనపై క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతుంటే, పాకిస్తాన్ మాత్రం విషం కక్కుతోంది.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ సందర్భంగా సెంచరీ చేసిన అనంతరం… కండలు చూపిస్తూ… ధ్రువ్ జురెల్ ( Dhruv Jurel ) రచ్చ చేశాడు. అదే సమయంలో తన చేతిపై ఉన్న జై జవాన్, జై కిసాన్ టాటును అందరికి చూపించే ప్రయత్నం చేశాడు. ధ్రువ్ జురెల్ ఫ్యామిలీ వ్యవసాయంపైన ఆధారపడి జీవిస్తోంది. దాన్ని ప్రతిబింబించేలా ధ్రువ్ జురెల్.. ఈ టాటూను వేయించుకున్నాడు. అయితే శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ సందర్భంగా ఈ టాటూను చూపించిన ధ్రువ్ జురెల్ పై ఇంజమామ్ ఉల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
లైవ్ మ్యాచ్ జరుగుతుండగా ఇలా కండలు చూపించడం ఐసిసి రూల్స్ ప్రకారం నేరమే అని బాంబు పేల్చారు. ఈ తరుణంలోనే ధ్రువ్ జురెల్ పై బ్యాన్ విధించాల్సిందేనని డిమాండ్ చేశారు. గతంలో ఫర్హాన్ గన్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడని వేటు వేశారు… ఇప్పుడు కండలు చూపించినందుకు ధ్రువ్ జురెల్ పైన కూడా యాక్షన్ తీసుకోవాల్సిందేనని ఐసీసీని డిమాండ్ చేశారు ఇంజమామ్ ఉల్ హక్.
ఆసియా కప్ 2025 సందర్భంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య దాదాపు మూడు మ్యాచ్ లు జరిగాయి. ఈ మూడు మ్యాచ్ లలో కూడా టీం ఇండియానే పై చేయి సాధించింది. ఒక్క మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ గెలవలేదు. అయితే ఇందులో పాకిస్తాన్ జట్టును గెలిపించేందుకు ఫర్హాన్ చాలా కష్టపడ్డాడు. అతనొక్కడే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ తరుణంలోనే బుమ్రా బౌలింగ్ లో సిక్సర్లు కొట్టడం.. అర్థ సెంచరీలు కూడా నమోదు చేశాడు. ఓ మ్యాచ్ లో అర్థ సెంచరీ పూర్తయిన తర్వాత గన్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. తన బ్యాట్ ను గన్ తరహాలో చూపించి సెలబ్రేషన్స్ చేసుకొని వివాదానికి తెర లేపాడు ఫర్హాన్. ఇక అప్పుడు అతనిపై ఐసీసీ చర్యలు కూడా తీసుకుంది. ఇప్పుడు కూడా జురేల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇంజమామ్.
HUNDRED MOMENT OF DHRUV JUREL…!!!!
– The way Siraj celebrated and supported Jurel in the partnership was special 🥹 pic.twitter.com/itmCr4Giln
— Johns. (@CricCrazyJohns) August 24, 2026