CSK vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో భాగంగా నేడు మరో రాసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమరం నేడు చెపాక్ స్టేడియం వేదికగా జరగబోతోంది. ఐపీఎల్ లో అత్యధిక ప్రజాదారణ పొందిన చెన్నై సూపర్ కింగ్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఎదురుపడుతున్నాయి. ఈ రెండు మేటి జట్లు కావడంతో ఏ జట్టు గెలుస్తుందోనని క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Yograj Singh: రోజు 20 కిలోమీటర్లు రోహిత్ శర్మ పరిగెత్తాల్సిందే..!
ఈ సీజన్ ని ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. ఓవైపు మాస్టర్ మైండ్, మిస్టర్ కూల్ ధోని. మరోవైపు ఫైర్ క్రాక్, ఫెయిర్ ప్లే విరాట్ కోహ్లీ. కెప్టెన్లు ఎవరైనా ఈ మ్యాచ్ మొత్తం వీళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ 2024 లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.
గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ ఛాన్స్ ఉండడంతో ఇరుజట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. హై టెన్షన్ మ్యాచ్లో విజయం ఆర్సిబిని వరించగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఇంటిదారి పట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో ఆర్సిబి సెలబ్రేషన్స్ తరస్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ ఇరుజట్ల బలాబలాలు, గత మ్యాచ్ ల విశ్లేషణలను పరిశీలిస్తే.. ఐపీఎల్ చరిత్రలో చెన్నై – ఆర్సిబి మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్ లు జరిగాయి.
ఇందులో చెన్నై 21సార్లు విజయం సాధించగా.. ఆర్సిబి 11 విజయాలు మాత్రమే సాధించింది. మరొక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక చెన్నై గడ్డపై 17 ఏళ్ల నుండి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. ఆర్సిబి చివరిసారిగా 2008 ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ లో చెపాక్ గడ్డపై గెలుపొందింది. ఆ తర్వాత మళ్లీ గెలిచిందే లేదు. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లోనైనా చెపాక్ గడ్డపై ఆర్సిబి గెలుస్తుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: Shardul Thakur: పడి లేచిన కెరటం… Un sold ప్లేయర్ నుంచి తోపు ఆటగాడిగా రికార్డ్ !
చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే మ్యాచ్ కి స్పిన్నర్లు కీలకం కానున్నారు. చెన్నై తరపున రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ ఉన్నారు. మరోవైపు బెంగుళూరు తరపున కృనాల్ పాండ్యా, లివింగ్ స్టోన్ లపై భారీ భారం ఉండబోతోంది. ఇక సోషల్ మీడియాలో ఇరుజట్ల అభిమానులు పోస్టులతో హోరెత్తిస్తున్నారు. గత 24 గంటలలో చెన్నైకి అనుకూలంగా 52%, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు 48% మంది మద్దతుగా నిలిచారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఏది ఏమైనా.. చివరికి మ్యాచ్ లో తమదే విజయం అని ఇరుజట్ల అభిమానులు పేర్కొంటున్నారు.
⏳ 4 hours to go for the 𝗖𝗟𝗔𝗦𝗛 𝗼𝗳 𝗚𝗘𝗡 𝗚𝗢𝗟𝗗 & 𝗕𝗢𝗟𝗗 𝗗𝗨𝗢 – MS Dhoni – Ruturaj Gaikwad vs Virat Kohli – Rajat Patidar!
From #CSK holding a 2% edge to #RCB leveling the score for a perfect tie, the tides have turned once again! 🌊💥
Who will claim this game?… pic.twitter.com/17pMQJPymM
— Star Sports (@StarSportsIndia) March 28, 2025