BigTV English

DC vs LSG: వైజాగ్ లో భారీ వర్షం… DC vs LSG మ్యాచ్ రద్దు ?

DC vs LSG: వైజాగ్ లో భారీ వర్షం… DC vs LSG మ్యాచ్ రద్దు ?

DC vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఈరోజు రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ – లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 1,700 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.


Also Read: Deepak Chahar’s sister Post: దీపక్ చాహర్‌పై ఆసక్తికర పోస్ట్ చేసిన సోదరి… బాహుబలిలోని కట్టప్ప అంటూ !

2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ఈసారి లక్నో కెప్టెన్ గా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. మరోవైపు లక్నో కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ఇప్పుడు ఢిల్లీ ప్లేయర్ గా మారాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. లక్నోలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్.. ఈరోజు జరిగే మ్యాచ్ లో ఆ జట్టు పై తన రివెంజ్ తీర్చుకుంటాడో లేదో అని అందరూ ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు షాక్ తగిలింది.


ప్రస్తుతం వైజాగ్ లో భారీ వర్షం పడుతుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మ్యాచ్ సమయంలోపు వర్షం తగ్గుతుందా..? లేక వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అవుతుందా..? అని అభిమానులలో టెన్షన్ నెలకొంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం ఉంటే.. మ్యాచ్ రద్దు కారణంగా ఇరుజట్లకు చెరో పాయింట్ ని కేటాయిస్తారు. అయితే ఇప్పటికే మైదానం వద్దకు చేరుకుని మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు.. వర్షం ఆగిపోవాలని కోరుకుంటున్నారు.

కొత్త కెప్టెన్లు, ప్లేయర్ల బలాబలాలు నేటి మ్యాచ్ తో తేలిపోనున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెటర్లపై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. దీంతోపాటు ఇరుజట్లకు ఈ ఐపీఎల్ సీజన్ లో ఇది తొలి మ్యాచ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బలాలను చూస్తే.. డూప్లేసిస్, జేక్ ఫ్రెజర్- మెక్ గుర్క్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బలంగా ఉంది.

అలాగే మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ నటరాజన్, ముఖేష్ కుమార్ తమ వైవిధ్యమైన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారని భావిస్తున్నారు. అలాగే స్పిన్ బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ మ్యాచ్ ని మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక లక్నో బలాలను చూస్తే.. రిషబ్ పంత్, పురన్, డేవిడ్ మిల్లర్, మీచల్ మార్ష్ వంటి బలమైన ఆటగాళ్లను కలిగి ఉంది. మరోవైపు రవి బిష్ణోయ్, షమర్ జోసెఫ్ బంతులతో చెలరేగే అవకాశం ఉంది.

 

ఇక ముఖ్యంగా రిషబ్ పంత్ ధైర్య సాహసాలు జట్టును గెలుపు తీరం వైపు నడిపించేందుకు కీలకం కానున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఈ ఇరుజట్లు ఇప్పటివరకు ఐదు సార్లు తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ కేవలం రెండు మ్యాచ్లలో గెలుపొందగా.. లక్నో మూడుసార్లు గెలుపొందింది. చివరిసారిగా ఈ ఇరుజట్లు గత సంవత్సరం ఢిల్లీ వేదికగా ఆడగా.. అందులో ఢిల్లీ 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే వర్షం తగ్గి ఈరోజు మ్యాచ్ కొనసాగుతుందా..? లేదా అన్నది వేచి చూడాలి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×