KKR Captain Rahane: మరికొద్ది గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 ప్రారంభం కాబోతోంది. ఈరోజు సాయంత్రం కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఐపీఎల్ 18వ సీజన్ వేడుకలతో ఐపిఎల్ 2025 అట్టహాసంగా ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడబోతోంది. ఈ రెండు జట్లు కలిసి ఓ సీజన్ తొలి మ్యాచ్ ఆడడం ఇదే మొదటిసారి.
కలకత్తా నైట్ రైడర్స్ జట్టుకు అజీంక్య రహానే నాయకత్వం వహిస్తుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రజత్ పటిదార్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 17 సంవత్సరాల తర్వాత ఈ ఇరుజట్లు తొలి మ్యాచ్లో తలపడుతున్నాయి. 2008 ఐపీఎల్ ప్రారంభం మ్యాచ్లో ఈ రెండు జట్లు పోటీ పడగా.. కలకత్తా జట్టు బెంగుళూరును ఓడించింది. ఇక గత సీజన్ చాంపియన్స్ అయిన కలకత్తా నైట్ రైడర్స్ ఈసారి కూడా విజయంతో శుభారంభం చేయాలని భావిస్తోంది.
ఇందుకోసం చాలా రోజుల ముందుగానే ప్రాక్టీస్ మొదలుపెట్టింది డిఫెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్. అయితే ప్రాక్టీస్ కోసం ప్రతి రోజు హోటల్ నుండి గ్రౌండ్ కి బస్సులో వెళ్లి రావాల్సి ఉంటుంది. కాగా ఎప్పటిలాగే ప్రాక్టీస్ కి వెళుతున్న సమయంలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. కలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ అజంక్య రహనే హోటల్ లో ఉన్న సమయంలోనే ఆ జట్టు బస్సు ప్రాక్టీస్ కి స్టార్ట్ అయ్యింది.
ఈ విషయం తెలుసుకున్న రహనే హోటల్ రూమ్ నుండి హడావిడిగా బయటికి పరిగెత్తుకొచ్చాడు. బస్సు స్టార్ట్ కావడంతో హోటల్ లో పరిగెడుతూ బయటకు వెళ్లాడు. అయితే హోటల్ బయట ఉన్న అభిమానులు ఆటోగ్రాఫ్ అని అరిచినా వినిపించుకోకుండా రన్నింగ్ చేశాడు. ఇది చూసిన హోటల్ స్టాఫ్ కూడా రహానే తో పాటు పరిగెత్తారు. ఈ వీడియోని ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో కెప్టెన్ అజింక్య రహానే లేకుండానే జట్టు బస్సు ఎలా స్టార్ట్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.
గతంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇలానే లేటుగా రావడం, మరచి పోవడం వంటివి చేసేవాడు. ఇప్పుడు రహానే కూడా రోహిత్ శర్మ లిస్ట్ లో చేరిపోయాడు. ఇక కలకత్తా కెప్టెన్ కొత్తగాడు అయినప్పటికీ.. ఈసారి జట్టు దాదాపు ఒకే విధంగా ఆడుతుంది. ఫీల్ సాల్ట్ స్థానంలో క్వింటన్ డికాక్ ప్రారంభ స్థానాన్ని భర్తీ చేస్తాడు. ఇక మరో ఓపెనర్ గా సునీల్ నరైన్ బరిలోకి దిగనున్నాడు. మిడిల్ ఆర్డర్ లో వైస్ కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ జట్టును నడిపిస్తాడు.
అలాగే అజింక్య రహానే.. శ్రేయస్ అయ్యర్ పాత్రను పోషిస్తాడు. ఆ తరువాత జట్టు ఫైర్ పవర్ రింకు సింగ్ తన సాధారణ పాత్రను పోషిస్తాడు. బౌలింగ్ విషయానికి వస్తే.. జాన్సన్, నోకియా, వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తారు. ఇక స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ జట్టుకు కీలకం కానున్నారు.
KKR team bus leaving without their captain Rahane 😭😭 pic.twitter.com/j9GjlqyKcl
— Pick-up Shot (@96ShreyasIyer) March 21, 2025