Big Tv Live Originals: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా రవాణా కోసం రైళ్లను ఆశ్రయిస్తున్నారు. నిత్యం కోట్లాది మంది రైల్వేల ద్వారా తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. అన్ని దేశాల్లోని రైల్వే వ్యవస్థలు రోజు రోజుకు సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని అప్ డేట్ అవుతున్నాయి. ఒకప్పుడు ఆవిరి ఇంజిన్ తో మొదలైన రైల్వేల ప్రస్థానం.. ఇప్పుడు అత్యాధునిక మాగ్నెటిక్ రైళ్ల వరకు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఏ రైలు ఇంజిన్, ఎంత వేగంతో ప్రయాణిస్తుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ ఆవిరి ఇంజిన్- గంటకు 100 కి.మీ
1800 సంవత్సరంలో ఆవిరి ఇంజిన్ తో కూడిన రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లు బొగ్గు, నీటితో నడిచేవి. ఈ ఇంజిన్లు శక్తివంతమైనవి. కానీ, ఆధునిక రైళ్లతో పోల్చితే నెమ్మదిగా నడుస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని చోట్ల ఈ రైళ్లు నడుస్తున్నాయి.
⦿ డీజిల్ ఇంజిన్- గంటలకు 120-160 కి.మీ
ఆవిరి ఇంజిన్ల తర్వాత డీజిల్ ఇంజిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లు ఇప్పటికీ ఉపయోగంలో ఉన్నాయి. డీజిల్ ఇంధనంతో ఈ రైళ్లు నడుస్తాయి. డీజిల్ ఇంజిన్లు ఎక్కువ శబ్దంతో పాటు కాలుష్యాన్ని వెదజల్లుతాయి. ప్యాసింజర్, గూడ్స్ రైళ్లకు డీజిల్ లోకోమోటివ్ ను వినియోగిస్తున్నారు.
⦿ ఎలక్ట్రిక్ ఇంజిన్- గంటకు 160-200 కి.మీ
ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లు అత్యంత శక్తివంతమైనవి. ఇవి అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. ఎలాంటి కాలుష్య ఉద్గారాలు వెదజల్లవు. ఓవర్ హెడ్ వైర్ల నుంచి విద్యుత్ ను పొందుతూ ముందుకు సాగుతాయి. మన దేశంలో చాలా ప్యాసింజర్ రైళ్లు, అత్యాధునిక వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఎలక్ట్రిక్ ఇంజిన్ లను ఉపయోగిస్తున్నాయి.
⦿ బుల్లెట్ రైలు- గంటకు 300-400 కి.మీ
బుల్లెట్ రైళ్లు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ రైళ్లు. ఇవి ప్రత్యేకమైన ట్రాక్ ల మీద నడుస్తాయి. ఈ రైళ్లు ప్రయాణీకులను అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతాయి. జపాన్‌కు చెందిన షింకన్ సెన్, చైనాకు చెందిన హై-స్పీడ్ రైళ్లు, యూరప్ కు చెందిన టిజివి రైళ్లు హైస్పీడ్ రైళ్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. మన దేశంలో ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో రైలు గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది.
⦿ మాగ్లెవ్ (మాగ్నెటిక్ లెవిటేషన్) రైలు- గంటకు 500-600 కి.మీ
మాగ్లెవ్ రైళ్లు మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీని ఉపయోగించి రూపొందిస్తున్నారు. ఈ రైలు ట్రాక్ మీద కాస్త ఎత్తులో తేలుతూ ముందుకు దూసుకెళ్తుంది. రైలును చాలా వేగంగా, సున్నితంగా ప్రయాణం చేస్తుంది. చైనాలోని షాంఘై మాగ్లెవ్ గంటకు 431 కి.మీ/గం వేగంతో నడుస్తుంది. జపాన్ ప్రయోగాత్మక మాగ్లెవ్ రైలు గంటకు 600 కి.మీ కంటే ఎక్కువ వేగాన్ని అందుకోవడం విశేషం.
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు ఏది?
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలుగా మాగ్లెవ్ రైళ్లు గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇవి గంటకు 500 కి.మీ కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్తారు. బుల్లెట్ రైళ్లు, ఎలక్ట్రిక్ రైళ్లు ప్రస్తుతం విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. డీజిల్, ఆవిరి ఇంజిన్లు నెమ్మదిగా నడుస్తాయి. ప్రస్తుతం భారత్ తో ఎక్కువగా విద్యుదీకరించబడిన ట్రాక్ లు అందుబాటులో ఉన్నాయి. భారత్ సహా అనేక దేశాలు రైలు రవాణాను మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్, బుల్లెట్ రైళ్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. భవిష్యత్తులో మరింత వేగవంతమైన, అధునాతన రైలు ఇంజిన్లు అందుబాటులోకి రానున్నాయి.
Read Also: RAC టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? అయితే.. ఈ విషయాలు కచ్చితంగా తెలియాల్సిందే