Sai Durga Tej: మెగాస్టార్ చిరంజీవి అనే మహా వృక్షం నుంచి ఎన్నో కొమ్మలు పుట్టుకొచ్చాయి. అలాంటి ఒక చిన్న కొమ్మనే మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్. చిరంజీవి సోదరి కుమారుడుగా ఇండస్ట్రీకి పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే ఆ డ్యాన్స్, యాక్టింగ్ తో కొంతవరకు పర్వాలేదనిపించాడు. ఆ తరువాత విజయాపజయాలను పక్కన పెట్టి.. కథలను వచ్చినవి వచ్చినట్టు చేసుకుంటూ పోయాడు.
ఇక చిత్రలహరి సినిమాతో తేజ్ .. టైర్ 2 హీరోల లిస్ట్ లోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత కూడా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాడు. కెరీర్ కొద్దిగా గాడిలో పడుతుంది అనుకొనేలోపు ఒక పెద్ద కుదుపు. 2021 లో తేజ్.. బైక్ యాక్సిడెంట్ కు గురైన విషయం తెల్సిందే. మెగా కుటుంబంతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు.. చావు అంచులవరకు వెళ్లి తేజ్ బతికివచ్చాడు. ఆ సమయంలో మెగా ఫ్యామిలీ కానీ, ఫ్యాన్స్ కానీ.. అతని కోసం ఎంత ప్రార్ధించారో అందరికీ తెల్సిందే. ఇక కొద్దీ కొద్దిగా కోలుకుంటూ విరూపాక్ష సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
Puri Jagannath: తల్లిదండ్రులే పెద్ద క్రిమినల్స్.. వారిని రేప్ చేస్తున్నారు
ఇక నేటితో తేజ్.. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తీ అయ్యాయి. తన కెరీర్ మొదలై దశాబ్దం అవ్వడంతో తేజ్.. తన పవన్ మామ ఆశీర్వాదాలు అందుకున్నాడు. ఇక ఈ మామ అల్లుళ్ల బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కోసం తేజ్ ఏదైనా చేస్తాడు. పవనే అతనికి గురువు, మెంటర్, ఫిలాసఫర్, దైవం కూడా. ఈ విషయాన్నీ ఎంతమంది ముందు అయినా చెప్పుకొస్తాడు. ఈ ఏడాది ఎలక్షన్స్ సమయంలో తేజ్ చేసిన ప్రచారాలు.. పవన్ గెలిచాక అతను చేసిన రచ్చ మెగా అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు.
పవన్ సైతం.. తేజ్ చావుబతుకుల్లో ఉన్నప్పుడు అల్లాడిపోయారు. ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా మేనల్లుడు బాగోగులు తెలుసుకుంటూనే ఉన్నారు. అంతలా వీరి మధ్య బాండింగ్ ఉంది. అందుకే పదేళ్ల ప్రస్థానం పూర్తైన సందర్భంగా మామ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి.. ఆయన ఆశీస్సులు అందుకున్నాడు. పవన్ సైతం.. తేజ్ కు శాలువా కప్పి.. మర్యాదపూర్వకంగా అభినందించారు. ఈ మేరకు జనసేన ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేసింది.
Ramya Krishnan: సౌందర్యతో ఆ సీన్ ఇష్టం లేకపోయినా చేశా.. ముఖంపై కాలు పెట్టి మరీ..
“నటన పట్ల ఎంతో తపనతో ఎదుగుతూ వస్తున్నారు సాయి తేదీ. నటుడిగా తొలి అడుగులు వేసినప్పటి నుంచీ సహ నటులు, సాంకేతిక నిపుణులపట్ల ఎంత గౌరవమర్యాదలతో ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ప్రతి విషయంపట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తాడు. అదే విధంగా తను ప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు కూడా ఎంతో ఆత్మ విశ్వాసం చూపించాడు. తనకు ఎదురైన పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఆలోచనతో రహదారి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు వహించాలో చైతన్యపరుస్తున్నాడు. సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడేవారు, పోస్టులు పెట్టడంపై బలంగా స్పందిస్తున్న తీరు సాయి దుర్గా తేజ్ లోని సామాజిక బాధ్యతను తెలియచేస్తోంది. ఇటీవల విజయవాడలో జల విపత్తు సంభవించినప్పుడు తన వంతు బాధ్యతగా స్పందించాడు. కథానాయకుడిగా మరిన్ని విజయాలు సాదించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని పవన్ తెలిపారు.
Pushpa 2 The Rule : ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే.?
ఇక తేజ్ కూడా పవన్ కు ధన్యవాదాలు తెలిపాడు. ” చిన్న మామయ్య ఆశీర్వాదం పొందడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. నా కెరీర్ కు మార్గదర్శిగా ఉన్నారు. చిన్నతనం నుంచి నాకు కళ్యాణి మావయ్యతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. స్కూల్లో చదివేటప్పుడు టెన్నిస్ ఆడేవాణ్ణి. ఒక టోర్నమెంట్ లో ఓడిపోయాను. ఇక ఆడను అని టెన్నిస్ రాకెట్ పక్కనపడేస్తే కళ్యాణ్ మావయ్య మోటివేట్ చేశారు. నీ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు. ఆటల్లో గెలుపోటములు సహజం. గెలిచే వరకూ ప్రయత్నించాలి అని చెప్పి మరో టోర్నమెంట్ కు పంపించారు. ఆ టోర్నీలో గెలిచాను. అప్పుడు మావయ్య బలంగా హత్తుకొని ముద్దుపెట్టారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి నన్ను ముందుకు తీసుకువెళ్తుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి.
This special moment will be and should be forever etched into my soul. my guru, my mama, and my senani @PawanKalyan mama taking his blessings means a lot to me . Thank you, Mama ❤️ pic.twitter.com/D3mutVgSxT
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 14, 2024