E-Paper
Advertisement

IPL 2026 Final: కోహ్లీ ఒంట‌రి పోరాటం, రెండోసారి ఛాంపియ‌న్ గా RCB, ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే

IPL 2026 Final: కోహ్లీ ఒంట‌రి పోరాటం, రెండోసారి ఛాంపియ‌న్ గా RCB, ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే
Advertisement

IPL 2026 Finals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) దాదాపు రెండు నెలలపాటు ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ క్రమంలో ఆదివారం రోజున గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final) మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా బిగ్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విక్టరీ సాధించింది. దీంతో వరుసగా రెండోసారి టైటిల్ నెగ్గిన జట్టుగా చరిత్ర సృష్టించింది బెంగుళూరు. ఈ మ్యాచ్ లో 156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ విధించింది. ఇక ఈ లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి చేదించింది బెంగళూరు. విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసిన నేపథ్యంలో, ఛాంపియన్ గా నిలిచింది బెంగుళూరు.

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

కోహ్లీ ఒంట‌రి పోరాటం, రెండోసారి ఛాంపియ‌న్ గా RCB

Advertisement

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్స్ జరిగింది. అయితే ఇందులో గుజరాత్ టైటాన్స్ మొదటి బ్యాటింగ్ చేసి 155 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. కానీ చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli) మాత్రం చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. 42 బంతుల్లో 75 పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇందులో మూడు సిక్సర్లు అలాగే తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. 178 స్ట్రైక్ రేట్ సాధించిన విరాట్ కోహ్లీ… సిక్సర్ కొట్టి బెంగుళూరు జట్టుకు రెండో టైటిల్ అందించాడు. దీంతో దేశవ్యాప్తంగా బెంగళూరు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అటు ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ తీవ్ర నిరాశకు గురైంది. ఇది ఇలా ఉండగా ఫైనల్స్ లో భారీ స్కోర్ నమోదు కాకపోవడంతో… మ్యాచ్ చెప్పగా సాగిందని విమర్శలు కూడా వస్తున్నాయి. దానికి తోడు విరాట్ కోహ్లీ చివరి వరకు ఉన్న నేపథ్యంలో.. జిడ్డు బ్యాటింగ్ అంటూ కొంతమంది ట్రోలింగ్ కూడా చేశారు.

ఐపీఎల్ విజేత‌కు ఫ్రైజ్ మ‌నీ ఎంతంటే ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ముగిసింది. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రైజ్ మనీ (IPL 2026 Prize Money) వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ టోర్నమెంట్ విజేతగా నిలిచిన జట్టుకు 20 కోట్లు దక్కనున్నాయి. ఇక ఫైనల్స్ లో ఓటమిపాలై… రన్నరప్ గా నిలిచిన జట్టుకు 13 కోట్లు దక్కనున్నాయి. అదే సమయంలో క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఏడు కోట్లు దక్కుతాయి. అటు ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 6.5 కోట్లు దక్కబోతున్నాయి. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్న వైభవ్ సూర్యవంశీకి ఏకంగా 10 లక్షలు దక్కనున్నాయి.

Advertisement

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్ 

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×