IPL auction 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు ( IPL 2025) సంబంధించిన మెగా వేలం ( IPL auction 2025 ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 24వ తేదీన అంటే నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన మెగా వేలం రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. అయితే ఈ మెగా వేలంలో ( IPL auction 2025 )… టీమిండియా స్టార్ ప్లేయర్లు అత్యధిక ధర పలికారు. అదే విదేశీ ప్లేయర్ల పైన పెద్దగా డబ్బులు పెట్టేందుకు ప్లాన్ చేసిలు సిద్ధపడలేదు. టోర్నమెంట్ మధ్యలోనే విదేశీ ప్లేయర్లు వెళ్లడం… గాయాల కారణాంగా దూరం అవుతున్నారు. అందుకే విదేశీ ప్లేయర్ల కంటే…ఎక్కువగా టీమిండియా స్టార్ ప్లేయర్లు అత్యధిక ధర పలికారు.
Also Read: Ishan kishan: కావ్య పాప స్కెచ్.. SRH లోకి ఇషాన్ కిషన్..ధర ఎంత అంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం బాక్సాఫీస్ హీరోగా రిషబ్ పంత్ నిలిచిన సంగతి తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) వికెట్ కీపర్-బ్యాటర్‌ను తమ జట్టులో భాగంగా చేయడానికి ఏకంగా 27 కోట్లు పెట్టింది. ఈ మెగా వేలం మొదటి రోజు రిషబ్ పంత్ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. మెగా వేలం బాక్సాఫీస్ హీరోగా రిషబ్ పంత్ కు రూ. 27 కోట్లు దక్కాయి. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ 26.25 కోట్ల భారీ మొత్తానికి పంజాబ్ కింగ్స్‌కు వెళ్లాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ ను INR 23 కోట్లకు పైగా పెట్టి కొనుగోలు చేసింది.
Also Read: David Warner unsold: డేవిడ్ వార్నర్, పడిక్కల్ Un Sold
మొదటి రోజు వేలంలో మొత్తం 84 మంది ప్లేయర్‌లు అదరగొట్టారు. మొత్తం పది ఫ్రాంచైజీలు 72 మంది ఆటగాళ్లకు INR 467.95 కోట్లను వెచ్చించాయి. సెట్ నెం.13 నుండి రెండవ రోజు మెగా వేలం ( IPL auction 2025 ) మళ్లీ ప్రారంభమవుతుంది. మయాంక్ అగర్వాల్‌తో ప్రారంభం కానుంది.
ఇవాళ వేలంలోకి వచ్చే కీలక ప్లేయర్లు
84. మయాంక్ అగర్వాల్ – భారతదేశం – INR 1 కోటి
85. ఫాఫ్ డు ప్లెసిస్ – దక్షిణాఫ్రికా – INR 2 కోట్లు
86. గ్లెన్ ఫిలిప్స్ – న్యూజిలాండ్ – INR 2 కోట్లు
87. రోవ్‌మన్ పావెల్ – వెస్టిండీస్ – INR 1.5 కోట్లు
88. అజింక్యా రహానే – భారత్ – INR 1.5 కోట్లు
89. పృథ్వీ షా – భారతదేశం – INR 75 లక్షలు
90. కేన్ విలియమ్సన్ – న్యూజిలాండ్ – INR 2 కోట్లు
91. సామ్ కర్రాన్ – ఇంగ్లాండ్ – INR 2 కోట్లు
92. మార్కో జాన్సెన్ – దక్షిణాఫ్రికా – INR 1.25 కోట్లు
93. డారిల్ మిచెల్ – న్యూజిలాండ్ – INR 2 కోట్లు
94. కృనాల్ పాండ్యా – భారతదేశం – INR 2 కోట్లు
95. నితీష్ రానా – భారతదేశం – INR 1.5 కోట్లు
96. వాషింగ్టన్ సుందర్ – భారతదేశం – INR 2 కోట్లు
97. శార్దూల్ ఠాకూర్ – భారతదేశం – INR 2 కోట్లు
98. K.S భారత్ – భారతదేశం – INR 75 లక్షలు
99. అలెక్స్ కారీ – ఆస్ట్రేలియా – INR 1 కోటి
100. డోనోవన్ ఫెరీరా – దక్షిణాఫ్రికా – INR 75 లక్షలు
101. షాయ్ హోప్ – వెస్టిండీస్ – INR 1.25 కోట్లు
102. జోష్ ఇంగ్లిస్ – ఆస్ట్రేలియా – INR 2 కోట్లు
103. ర్యాన్ రికెల్టన్ – దక్షిణాఫ్రికా – INR 1 కోటి
104. దీపక్ చాహర్ – భారతదేశం – INR 2 కోట్లు
105. గెరాల్డ్ కోయెట్జీ – దక్షిణాఫ్రికా – INR 1.25 కోట్లు
106. ఆకాష్ దీప్ – ఇండియా – INR 1 కోటి
107. తుషార్ దేశ్‌పాండే – భారతదేశం – INR 1 కోటి
108. లాకీ ఫెర్గూసన్ – న్యూజిలాండ్ – INR 2 కోట్లు
109. భువనేశ్వర్ కుమార్ – భారతదేశం – INR 2 కోట్లు
110. ముఖేష్ కుమార్ – భారతదేశం – INR 2 కోట్లు
111. అల్లా ఘజన్‌ఫర్ – ఆఫ్ఘనిస్తాన్ – INR 75 లక్షలు