Cummins – Travis Head : ఆస్ట్రేలియా క్రికెటర్లు పాట్ కమ్మిన్స్ ( Pat Cummins ), ట్రావిస్ హెడ్ ( Travis Head) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు, ఆస్ట్రేలియా అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా రాణిస్తున్నారు. అయితే అలాంటి పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ లకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ప్రాంచైజీ ఏకంగా రూ.58 కోట్ల చొప్పున ఆఫర్ చేసిందట. ఆస్ట్రేలియా జట్టును వదిలి తమ జట్టుకు ఆడితే, రూ. 58 కోట్ల చొప్పుపన ఇద్దరికీ ఇస్తామని తెలిపిందట సదరు ఫ్రాంచైజీ. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది.
Also Read: Inzamam-ul-Haq: రోహిత్ శర్మ ఓ ముసలోడు, పందిలాగా ఉంటాడు…అందుకే కెప్టెన్సీ పీకిపారేశారు !
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు పాట్ కమ్మిన్స్ ( Pat Cummins ), ట్రావిస్ హెడ్ కు ( Travis Head) ఓ ఐపీఎల్ ప్లాన్ చేసి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు నేషనల్ మీడియా కథనాలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా జట్టును వదిలేసి, తమ ఫ్రాంచైజీ గ్లోబల్ టి20 టోర్నమెంట్ లో ఆడితే… ప్రతి సంవత్సరానికి 58.2 కోట్ల చొప్పున అందిస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే లగ్జరీ కార్లతో పాటు ఫ్లాట్ కూడా ఇస్తామని తెలిపిందట. అయితే ఈ ఆఫర్ కు మాత్రం ఈ ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశారట. తమ ఆస్ట్రేలియా జట్టుకు మాత్రమే ఆడదామని ఇద్దరు ప్లేయర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. డబ్బుకు కక్కుర్తి పడే వ్యక్తులను తాము కాదని ఈ సందర్భంగా వెల్లడించారు.
దీంతో పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియా జట్టు తరుపున పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ ఇద్దరు ఆడితే ఏడాదికి 8.74 కోట్ల చొప్పున ఆదాయం వస్తుంది. అయితే వాళ్ళు తీసుకునే జీతానికి ఏడు రేట్లు ఐపిఎల్ ఫ్రాంచేసి ఆఫర్ చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. జాతీయ జట్టుకు ఆడతామని తేల్చి చెప్పారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ద్వారానే ఆస్ట్రేలియా ప్లేయర్లు పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ ఇద్దరు మెరిసారు. 2024 మెగా వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్ ను 20.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. అలాగే ట్రావిస్ హెడ్ ను 2024లో 6.8 కోట్లకు కొనుగోలు చేసి 2025 వరకు 14 కోట్లకు పెంచింది. వాళ్ళ ఆట తీరును చూసి రేటు పెంచారు కావ్య పాప. ఇలా ఏడాది ఐపీఎల్ ద్వారా బాగానే సంపాదిస్తున్నారు పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్.
Also Read: Gautam Gambhir: గంభీర్ మహాముదురు.. ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు బీరు, బిర్యానీలు పెట్టి మరీ !
An IPL franchise offered Pat Cummins and Travis Head salaries of ₹58 crore per year each in year-round deals, asking them to quit Australian cricket and play T20 franchise cricket exclusively pic.twitter.com/PLhjNJ1YjB
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) October 8, 2025