అదరగొట్టే ఆటతీరుతో T20 వరల్డ్ కప్ ను ఎగరేసుకుపోయింది… ఇంగ్లండ్ టీమ్. ఆ జట్టులోని ప్రతీ ప్లేయర్… ఫుల్ ఫామ్ లో ఉండటంతో… ఇంగ్లిష్ టీమ్ ఈజీగా పొట్టి కప్ కొట్టింది. దాంతో… ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెటర్లను వేలంలో దక్కించుకునేందుకు… ఎంతైనా ఖర్చు పెట్టాలని భావిస్తున్నాయి… ఐపీఎల్ ఫ్రాంచైజీలు.
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, సామ్ కరన్… కొచ్చిలో డిసెంబర్ 23న జరిగే ఐపీఎల్-2023 మినీ వేలానికి అందుబాటులో ఉంటారని సమాచారం. వరల్డ్‌కప్‌లో, ముఖ్యంగా పాక్‌తో జరిగిన ఫైనల్లో ఈ ఇద్దరూ దుమ్మురేపడంతో… ఐపీఎల్ ఫ్రాంచైజీలు వాళ్లని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. వివిధ కారణాలతో గత ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్న స్టోక్స్, సామ్ కరన్ లను ఎంత ధర అయినా పెట్టి కొనేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బెంగళూరు, పంజాబ్ ఫ్రాంచైజీలు… ఒక్కొక్కరికి ఏకంగా రూ.20 కోట్లు అయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చాయి.
2017 సీజన్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్… ఏకంగా 14.5 కోట్లకు స్టోక్స్‌ను సొంతం చేసుకోగా, 2018 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ 12.5 కోట్లకు స్టోక్స్‌ను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న స్టోక్స్… 2021 సీజన్ ఐపీఎల్ ఆరంభంలోనే గాయం కారణంగా తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతణ్ని పట్టించుకోక పోవడంతో… అలిగిన స్టోక్స్… వేలంలో తన పేరు కూడా రిజిస్టర్ చేసుకోలేదు.
ఇక… 2019లో టీమిండియాపై చెలరేగి ఆడి వెలుగులోకి వచ్చిన సామ్ కరన్‌ను… అదే ఏడాది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 7.2 కోట్ల భారీ మొత్తాని కొనింది. కానీ… ఆ సీజన్‌లో అంచనాలకు తగ్గట్టుగా సామ్ రాణించలేదు. దాంతో… 2020లో పంజాబ్ అతణ్ని వదులుకుంది. అప్పుడే చెన్నై సూపర్ కింగ్స్ అతణ్ని 5.5 కోట్లకు సొంతం చేసుకుంది. చెన్నై తరఫున వరుసగా రెండు సీజన్లలో ఫరవాలేదనిపించేలా ఆడిన సామ్… ఈ ఏడాది గాయం కారణంగా వేలంలో తన పేరు రిజిస్టర్ చేసుకోలేదు.