E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

FIFA World Cup 2026: అమెరికా లాక‌ర్ రూంలో ఇరాన్ లేఖ క‌ల‌క‌లం..!

FIFA World Cup 2026: అమెరికా లాక‌ర్ రూంలో ఇరాన్ లేఖ క‌ల‌క‌లం..!
Advertisement

FIFA World Cup 2026:  ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (FIFA World Cup 2026) చాలా ఉత్కంఠంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ను ఉత్తర అమెరికా ఖండంలోని USA, కెనడా అలాగే మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం వహిస్తున్నాయి. గతంలో ఈ టోర్నమెంటులో 32 జట్లు మాత్రమే ఆడేవి.. కానీ వెసులు బాటు కల్పించి 48 దేశాలకు అవకాశం కల్పించారు. జట్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో… మ్యాచ్ ల సంఖ్య కూడా 104 కు చేరుకుంది. జూన్ 12వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్, జులై 19వ తేదీ వరకు కొనసాగు ఉంది. దాదాపు 40 రోజులపాటు సాగే ఈ టోర్నమెంట్ లో ఇరాన్ కూడా పాల్గొంటుంది. ఇరాన్ వర్సెస్ అమెరికా ( Iran Vs Usa) మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ వరల్డ్ కప్ హాట్ టాపిక్ అయింది. లేటెస్ట్ గా అమెరికా ( USA) లాకర్ రూమ్ లో ఇరాన్ ఫుట్ బాల్ జట్టు ( Iran Foot Ball) పెట్టిన ఓ లేఖ కలకలం రేపింది. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ లేఖ రాయడం చర్చనీయాంశమైంది.

Also Read:  Tanveer Ahmed On ICC Womens World Cup 2026 Womens Pakistan Team: నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

ఇరాన్ జట్టు లేఖ కలకలం

Advertisement

తాజాగా లాస్ ఏంజెల్స్ వేదికగా బెల్జియంతో ఇరాన్ మ్యాచ్ ఆడింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం, ఓ ఎమోషనల్ లెటర్ ను లాకర్ రూమ్ లో ఉంచింది ఇరాన్ టీం. అయితే అందులో ఉన్న సారాంశాన్ని ఇరాన్ ఫుడ్ బాల్ ఫెడరేషన్ తాజాగా విడుదల చేయడం జరిగింది.  ఆతిథ్యం ఇచ్చిన అమెరికాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నప్పటికీ చాలా ధైర్యంగా లాస్ ఏంజెల్స్ కు వచ్చినట్లు ఈ లేఖలో వివరించారు. చాలా స్వేచ్ఛగా, హుందాగా నగరంలో తిరుగుతున్నామని పేర్కొన్నారు. తమ జట్టుకు మద్దతు తెలిపిన వాళ్లందరికీ కృతజ్ఞతలు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతి, స్నేహం పరస్పర గౌరవం వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు ఈ లేఖలో వివరించారు. రెండు దేశాల మధ్య ఎప్పటిలాగే సంబంధాలు పెరగాలని.. యుద్ధం జరగకుండా చూడాలని కోరారు. దీంతో ఈ లేఖ వైరల్ గా మారింది.

ఫిఫా వరల్డ్ కప్ లో దూసుకువెళ్తున్న ఇరాన్

పచ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాలో అడుగు పెట్టింది ఇరాన్ ఫుట్ బాల్ జట్టు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఈ టోర్నమెంట్ లో ఆడింది. న్యూజిలాండ్ అలాగే బెల్జియం జట్లతో తలపడింది. ఈ రెండు మ్యాచ్లు కూడా డ్రాగ ముగిశాయి. ఓటమి లేకుండా ముందుకు సాగుతున్న ఇరాన్, నాకౌట్ రేసులోనే ఉంది.

Advertisement

Also Read: Ravichandran Ashwin weighs in on Ishan Kishan: అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

 

Related News

ఎలిమినేట్ అయిన సిగ్గు రాలేదు…జై షాపై పాకిస్తాన్ స‌రికొత్త కుట్ర‌

కొంప‌ముంచిన‌ రాధ యాద‌వ్..రెండు క్యాచ్ లు మిస్‌, టీమిండియా ఎలిమినేట్ ?

పాకిస్తాన్ మ‌హిళ‌లకు క్రికెట్ చేత‌కాదు కానీ, వంట‌లు మాత్రం బాగా చేస్తారు

Pollard Vs Milind: పొలార్డ్ కే సినిమా చూపించిన మిలింద్..బిత్త‌ర‌పోయిన అంపైర్లు

వరల్డ్ కప్ లో 33 యాడ్స్.. కానీ చేసింది 32 పరుగులే, జెమిమాను తీసేయండి అంటూ ట్రోల్స్‌

మ‌ళ్లీ వైభ‌వ్ కాల‌ర్లు ప‌ట్టుకుంటాడ‌ని భ‌యంతో శ్రీలంక బౌల‌ర్లు స్లోగా బంతులు వేశారు !

15 ఏళ్ల వ‌య‌స్సులో నాకు బ్యాట్ స‌రిగ్గా పట్టుకోలేకపోయేవాడిని..కానీ వైభ‌వ్ మాత్రం !

Big Stories

×