IND VS IRE: టీమిండియా జట్టుకు ఘోర అవమానం ఎదురయింది. టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ ( Ireland vs India) మధ్య ఇవాళ టి20 సిరీస్ ( India tour of Ireland, 2026 ) ప్రారంభం కాగా, మొదటి మ్యాచ్ లోనే శ్రేయస్ అయ్యర్ సేన చిత్తుగా ఓడిపోయింది. పసికూన ఐర్లాండ్ చేతిలో ఏకంగా 34 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవడం గమనార్హం. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు సాధించింది. మొదట్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన టీమిండియా, ఆ తర్వాత ధారాళంగా పరుగులు సమర్పించుకుంది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 148 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది టీమ్ ఇండియా. దీంతో తొలి టెస్ట్ లో ఓడిపోయి పరువు తీసుకుంది. ఈ క్రమంలో టీమిండియా పై దారుణంగా ట్రోలింగ్స్ కూడా మొదలయ్యాయి. టీమిండియా ఓటమికి గౌతమ్ గంభీర్, అతడి శిష్యులే కారణమంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.
పసికూన ఐర్లాండ్ చేతిలో టీమిండియాకు ఘోర అవమానం ఎదురయింది. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ టి20 సిరీస్ ప్రారంభం కాగా, ఐర్లాండ్ ను తక్కువ అంచనా వేసింది టీమిండియా. ఈ క్రమంలోనే రెచ్చిపోయిన ఐర్లాండ్ క్రికెటర్లు, టీమిండియాపై పంజా విసిరారు. తొలి మ్యాచ్ సందర్భంగా ఐర్లాండ్ చేతిలో 34 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది టీమిండియా. ఈ నేపథ్యంలో టీమిండియా ఓటమిని ఉద్దేశించి దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. గౌతమ్ గంభీర్ చెత్త నిర్ణయాలు, అతని శిష్యుల కారణంగానే టీమిండియా ఓడిపోయిందని సెటైర్లు పేల్చుతున్నారు. ఇవాళ జరిగిన మ్యాచ్ లో రవి బిస్నోయ్, ప్రిన్స్ యాదవ్ లాంటి తోపు బౌలర్లను కాదని, ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ లను బరిలోకి దించాడు గంభీర్.
శ్రేయస్ అయ్యర్ చెప్పినప్పటికీ కూడా గంభీర్ వినలేదట. గంభీర్ ఆదేశాల మేరకు తుది జట్టులో స్థానం దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్ ఒకే ఒక్క ఓవర్ వేసి, 19 పరుగులు సమర్పించుకున్నాడు. అటు ప్రసిద్ధి కృష్ణ నాలుగు ఓవర్లు వేసి 57 పరుగులు ఇచ్చేశారు. అంటే ఈ ఇద్దరు కలిసి మొత్తం 76 పరుగులు సమర్పించుకున్నారు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. ఇక్కడ టీమిండియా కొంప మునిగింది. అప్పటివరకు హర్షిత్ రాణా, అర్షదీప్ బాగానే వేసినప్పటికీ.. గంభీర్ శిష్యులు మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించి టీమ్ ఇండియాను ఓడించారు. వీళ్లే కట్టడిగా బౌలింగ్ చేసి ఉంటే, టీమిండియా ముందు తక్కువ టార్గెట్ ఉండేది. అప్పుడు వికెట్లు పడినా కూడా ఎవరో ఒకరు మ్యాచ్ గెలిపించేవాళ్ళు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ, గంభీర్ ను ఆడుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.