E-Paper
Advertisement

బంగ్లాదేశ్ లో టీమిండియాకు సెక్యూరిటీ లేదు..స్టేడియంపై దాడులు జ‌రిగే ఛాన్స్‌?

బంగ్లాదేశ్ లో టీమిండియాకు సెక్యూరిటీ లేదు..స్టేడియంపై దాడులు జ‌రిగే ఛాన్స్‌?
Advertisement

BCCI On IND VS BAN:  టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ ( IND VS BAN) మధ్య సెప్టెంబర్ మాసంలో మూడు వన్డే లతో పాటు మూడు టీ20 లు జరిగేలా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), బీసీసీఐ ( BCCI) మధ్య సమావేశాలు కూడా జరిగినట్లు సమాచారం. అయినప్పటికీ దీనిపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా వెళ్లాలంటే కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ ( PM MODI) అనుమతి అవసరం. ఇందులో భాగంగానే టీమిండియా పర్యటనపై మోడీ ప్రభుత్వానికి బీసీసీఐ లేఖ కూడా రాసింది. మోడీ సర్కార్ నుంచి అనుమతులు వస్తేనే.. ఈ టూర్ పై క్లారిటీ వస్తుంది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సతమతమవుతోంది.

బంగ్లా టూర్ పై క్లారిటీ ఇచ్చిన దేవజిత్ సైకియా?

టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ ( IND VS BAN)  మధ్య జరిగే వన్డే, టి20 సిరీస్ పై బీసీసీఐ అధికారి దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బంగ్లాదేశ్ టూర్ కు టీమిండియాను పంపించాలంటే కచ్చితంగా మోడీ ప్రభుత్వం నుంచి అనుమతులు కావాలని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే మోడీ ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్లు వివరించారట.

Advertisement

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

ప్రస్తుతం షేక్ హసీనా ఇండియాలో ఉన్న నేపథ్యంలో బంగ్లాదేశ్ లో అల్లర్లు జరుగుతున్నట్లు వివరించారు. షకీబ్‌ అల్‌ హసన్‌ (Shakib Al Hasan) ఇంటి పై కూడా ఇటీవల బంగ్లాదేశ్ లో దాడి జరిగింది. ఇలాంటి పరిణామాల నడుమ బంగ్లాదేశ్ కు టీమిండియా వెళ్తే పెను ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా దేవజిత్ సైకియా పేర్కొన్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే బంగ్లాదేశ్ టూర్ పై ఇంకా క్లారిటీ రావడంలేదని ఆయన పేర్కొన్నారు.

స్టేడియాలపై బాంబులు వేస్తే పరిస్థితి ఏంటి ?

Advertisement

బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ షకీబ్‌ అల్‌ హసన్‌ (Shakib Al Hasan) ఇంటి పైన దాడి జరిగిన నేపథ్యంలో… టీమిండియా క్రికెటర్ల పై దాడులు చేయక కూర్చుంటారా ? అని ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2026 టి20 ప్రపంచ కప్ సమయంలో ఇండియా పరువు తీసిన బంగ్లాదేశ్ కు ఇప్పుడు మన బీసీసీఐ విలువ గుర్తుకు వచ్చిందా ? అని నిలదీశారు. అప్పుడు ఇండియాకు రమ్మంటే.. భద్రతా కారణాలు చూపించి వరల్డ్ కప్ బహిష్కరించారు కదా ? ఇప్పుడు టీం ఇండియా కూడా అలాగే చేసి దెబ్బకు దెబ్బ తీయాలని కోరుతున్నారు. పాకిస్తాన్ కుక్కల మాటలు విని.. ఇప్పుడు ఇండియా దగ్గరికి వస్తే, క్షమించాలా ? అని ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. మోడీ ప్రభుత్వం ఈ టూర్ కు అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు.

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

Related News

అన‌వ‌స‌రంగా భ‌య‌ప‌డొద్దు…టీమిండియాను ఓడించ‌డం చాలా ఈజీనే

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

వ‌ర్షం ప‌డి, టీమిండియా వ‌ర్సెస్ పాక్ ఫైన‌ల్స్ ర‌ద్దు కావాలి

పాకిస్తాన్ క్రికెట్ లో విషాదం…130 కేజీల ఆజం ఖాన్ మృతి ?

భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

వర్షం పడకపోయింటే, టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం…అజ్మల్ జద్రాన్ సంచలనం !

కోహ్లీని పొగిడి పొగిడి విసుగు వచ్చేసింది…ఇకపై పాకిస్తాన్ తలవంచి దండం పెట్టాల్సిందే

దక్షిణాఫ్రికా జట్టులో చీలిక..తన్నుకున్న తెంబా బ‌వుమా, క్వింటన్ డికాక్

Big Stories

Advertisement
×