Irfan Pathan reply to Shahid Afridi: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs. Pakistan) మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిందంటే జనాలందరూ టీవీల ముందే అతుక్కుపోతూ ఉంటారు. అలాగే పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ప్లేయర్ల మధ్య జరిగే గొడవలు కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. ఇప్పటికే ఇరు జట్ల క్రికెటర్ల మధ్య చాలా సందర్భాలలో గొడవ పడ్డారు. అయితే అలాంటి సంఘటన గురించే తాజాగా ఇర్ఫాన్ పఠాన్ ( Irfan Pathan) పంచుకున్నారు. పాకిస్తాన్ ఒకప్పటి కెప్టెన్ షాహిద్ అఫ్రిది తన జాతిని కించపరుస్తూ అవమానించాడని ఫైరయ్యారు. తనను ఫేక్ పఠాన్ (fake Pathan) అంటూ దారుణంగా తిట్టాడని… గ్రౌండ్ లోనే కాకుండా పలు ఇంటర్వ్యూలలో ఇదే వ్యాఖ్యలు చేశాడని ఫైర్ అయ్యారు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ( Shahid Afridi) తనను అవమానించడానికి తాజాగా ఇర్ఫాన్ పఠాన్ ఫైర్ అయ్యారు. మ్యాచ్ సందర్భంగా తనను డిస్టర్బ్ చేసేందుకు.. షాహిద్ అఫ్రిది విశ్వ ప్రయత్నాలు చేసేవాడని ఆరోపణలు చేశారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు చాలా సార్లు తనను ఫేక్ పఠాన్ అంటూ కించపరిచే ప్రయత్నం చేశాడని మండిపడ్డారు. పలు ఇంటర్వ్యూలలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశాడని ఆగ్రహించారు. అయితే తనను ఎంతో హేళన చేస్తూ మాట్లాడినా కూడా, తాను మాత్రం ఏకాగ్రతతో బౌలింగ్ చేశానని వెల్లడించారు.
ఇప్పటి వరకు తన కెరీర్ లో 11 సార్లు షాహిద్ అఫ్రిది వికెట్ పడగొట్టిన చరిత్ర తనదేనని గర్వంగా ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను బూతులు తిడుతూ అవమానించిన షాహిద్ అఫ్రిదికి తన బంతితో సమాధానం చెప్పానని వెల్లడించారు. అదే తనకు సంతృప్తిని ఇచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ల జరిగితే మనవాళ్లు గొడవల జోలికి వెళ్లకుండా.. ఆట ద్వారా ఆన్సర్ ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఇర్ఫాన్ పఠాన్ ను ఫేక్ పఠాన్ అని షాహిద్ అఫ్రిది అనడం వెనుక పెద్ద అర్థమే ఉంది. అసలు పఠాన్ అంటే ఒక ప్రముఖ జాతికి సంబంధించిన వ్యక్తులు. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలలో ఈ జాతికి సంబంధించిన వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఇండియాలో ఉర్దూ లేదా హిందీ భాషల్లో పఠాన్ అనే పేరును వాడుతూ ఉంటారు. పఖ్తున్ అనే మూలం నుంచి పఠాన్ పేరు వచ్చింది. ఈ పఠాన్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ధైర్యంగా, పోటీ తత్వం కలిగి ఉంటారు. చరిత్రలో గొప్ప యోధులుగా గుర్తింపు పొందినవారు.