Jamie Overton: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆల్ రౌండర్ జామీ ఓవర్టన్ వెన్నుపోటు పొడిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తో నిన్న జరగాల్సిన కీలకమైన మ్యాచ్ నేపథ్యంలో గాయం పేరుతో ఎస్కేప్ అయ్యాడని జామీ ఓవర్టన్ పై (Jamie Overton) విమర్శలు వస్తున్నాయి. గాయం పేరుతో చెన్నైకి వెన్నుపోటు పొడిచి.. కౌంటీ క్రికెట్ లో సెంచరీ చేశాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఓ రేంజ్ లో సీరియస్ అవుతున్నారు. జామీ ఓవర్టన్ ను ఉద్దేశించి దారుణంగా పోస్టులు కూడా పెడుతున్నారు. ఇలాంటి వెధవలను ఐపీఎల్ లోకి తీసుకోకూడదని డిమాండ్ చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో కచ్చితంగా గెలవాల్సిన చెన్నై సూపర్ కింగ్స్… హైదరాబాద్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో జామీ ఓవర్టన్ ఉండి ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ అవలీలగా గెలిచేది. కానీ గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. మిగిలిన మ్యాచ్ లు కూడా ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. అయితే, ఇంగ్లాండ్ వెళ్లిపోయిన జామీ ఓవర్టన్ కు గాయం కాలేదని.. అతడు బాగానే ఉన్నాడని కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. కౌంటీ క్రికెట్ లో సెంచరీ కూడా చేశాడని వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు జామీ ఓవర్టన్ వెన్నుపోటు పొడిచారని దారుణంగా పోస్టులు పెడుతున్నారు అభిమానులు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు జామీ ఓవర్టన్ వెన్నుపోటు పొడిచాడు అన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. నిజంగానే జామీ ఓవర్టన్ కు గాయమైంది. తొడ కండరాలు పట్టేయడంతో అతడు రెస్ట్ మూడ్ లోకి వెళ్ళాడు. అయితే కౌంటింగ్ క్రికెట్ లో సెంచరీ చేసింది జామీ ఓవర్టన్ సోదరుడు క్రైగ్ ఓవర్టన్ ( Craig Overton). అచ్చం ఓవర్టన్ లాగానే క్రైగ్ ఓవర్టన్ ఉన్నాడు. అంటే ఇద్దరు ట్విన్ బ్రదర్స్. దీంతో జామీ ఓవర్టనే సెంచరీ చేసినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ విషయం లేటుగా తెలుసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు.. రియలైజ్ అవుతున్నారు. జామీ ఓవర్టన్ వెంటనే కోలుకోవాలని పోస్టులు పడుతున్నారు.
Also Read: Mushfiqur Rahim: కాలితో గట్టిగా తన్నిన ముష్ఫిఖర్ రహీం..10 మీటర్ల దూరంలో పడ్డ హెల్మెట్
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==