E-Paper
Advertisement

కావాల‌నే ర‌న్స్ ఇచ్చి వెస్టిండీస్ ఛీటింగ్…బాబ‌ర్ ఆజం సేన ఘోర ఓట‌మి

కావాల‌నే ర‌న్స్ ఇచ్చి వెస్టిండీస్ ఛీటింగ్…బాబ‌ర్ ఆజం సేన ఘోర ఓట‌మి
Advertisement

WI VS PAK :  పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (West Indies vs Pakistan) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ (Pakistan tour of West Indies, 2026 ) జరుగుతోంది. వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు తొలి ఎదురు దెబ్బ తగిలింది. బ్రియన్ లారా స్టేడియం ( Brian Lara Stadium, Tarouba, Trinidad) వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో ఏకంగా 90 పరుగులు తేడాతో ఓటమిపాలైంది పాకిస్తాన్. బాబర్ ఆజం ( babar azam ) కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నప్పటికీ… పాకిస్తాన్ తలరాత మాత్రం మారలేదు. అయితే ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ చీటింగ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాబర్ ఆజం కొట్టిన ఓ బంతిని కావాలనే బౌండరీ వెళ్లేలా వెస్టిండీస్ కుట్రలకు తెర లేపింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ అత్యంత దారుణంగా ఓడిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

కావాల‌నే ర‌న్స్ ఇచ్చి వెస్టిండీస్ ఛీటింగ్

Advertisement

వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య బ్రియన్ లారా స్టేడియం వేదికగా తొలి టెస్ట్ మొన్న జూలై 25వ తేదీన ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ తొలి టెస్ట్ మ్యాచ్ తాజాగా ముగిసిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న బాబర్ ఆజం రెండో ఇన్నింగ్స్ లో ఒంటరి పోరాటం చేశాడు. 107 బంతులు ఎదుర్కొన్న బాబర్ ఆజం, 58 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ కూడా సపోర్ట్ చేయకపోవడంతో… రెండో ఇన్నింగ్స్ లు 120 పరుగులకు కుప్పకూలింది పాకిస్తాన్. దీంతో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఇదే రెండో ఇన్నింగ్స్ లో మహమ్మద్ అబ్బాస్ తో బాబర్ ఆజం పదవ వికెట్ కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రతి మ్యాచ్ చివరి బంతికి, సింగిల్ తీసుకొని… ఆ తర్వాత ఓవర్ లో బాబర్ స్ట్రైకింగ్ తీసుకునేవాడు.

మహమ్మద్ అబ్బాస్ ( Mohammad Abbas) వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు బాబర్ ఆజం. అయితే ఇది గమనించిన వెస్టిండీస్ ఆటగాళ్లు చీటింగ్ చేశారు. బాబర్ 45 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. 31 ఓవర్ ను జోసెఫ్ వేశాడు. అయితే ఈ ఓవర్ చివరి బంతిని, సింగిల్ కోసం ప్రయత్నించాడు బాబర్ ఆజం. అయితే సింగిల్ వస్తే బాబర్ మళ్లీ స్ట్రైక్ లోకి వస్తాడని ఫీల్డర్ జేడెన్ సీల్స్ (Jayden Seales), బంతిని పట్టకుండా బౌండరీ తరలించాడు. ఇలాంటి సంఘటనలు నిన్నటి మ్యాచ్ లో చాలానే జరిగాయి. దీంతో 23 పరుగులు చేసిన మహమ్మద్ అబ్బాస్ వికెట్ కోల్పోయాడు. ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. బాబర్ నాట్ అవుట్ గా మిగిలినప్పటికీ.. మిగిలిన అన్ని వికెట్లు పడిపోవడంతో, తొలి టెస్ట్ లో ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో జేడెన్ సీల్స్ చేసిన ప‌నిపై పాకిస్తాన్ మాజీలు సీరియ‌స్ అవుతున్నారు.

Advertisement

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

 

Related News

డ్రెస్సింగ్ రూమ్ వైపు దొంగ చూపులు చూసి రివ్యూలు తీసుకునేవారు – పుజారా

గంగూలీ క్రికెట్ కు పనికిరాడంటూ మెయిల్…గ్రెగ్ చాపెల్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఫ్యాన్స్

ఒరేయ్ నఖ్వీ… నీకు ఏది చేతకాదు కానీ, ఆసియా కప్ అయినా దొంగిలించు !

ఆస్ట్రేలియాకు వెళ్ళాక టీమిండియా నుంచి ధోని తరిమేశాడు..సెహ్వాగ్ సంచలనం !

వహాబ్ రియాజ్ కోచ్ కాదు…వాడు పెద్ద కామాంధుడు, డ్రెస్సింగ్ రూమ్ లోనూ వదలడు !

1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

2011 వరల్డ్ కప్ సెమీస్‌ లో సచిన్ LBW అయినా, థర్డ్ అంపైర్ ఇవ్వలేదు

నన్ను ఫిక్సర్, దేశ ద్రోహి అంటూ గంభీర్ అవమానించాడు..శ్రీశాంత్ ఎమోషనల్

Big Stories

Advertisement
×