E-Paper
Advertisement

ఫ్రిడ్జ్ డోర్‌పై అయస్కాంతాలు.. కరెంట్ బిల్లుపై పడే ప్రభావం ఎంత? నిజానిజాలివే!

ఫ్రిడ్జ్ డోర్‌పై అయస్కాంతాలు.. కరెంట్ బిల్లుపై పడే ప్రభావం ఎంత? నిజానిజాలివే!
Advertisement

Fridge Magnets: ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో వాస్తవాలతో సంబంధం లేకుండా ప్రతీ అంశం వైరల్ అవుతోంది. ముఖ్యంగా నిరాధారమైన పుకార్లు.. నెటిజన్లను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో మెుదలైన ఓ కొత్త పుకారు.. ఫ్రిడ్జ్ యూజర్లను విపరీతంగా కన్ఫ్యూజ్ చేస్తోంది. ఫ్రిడ్జ్ డోర్ పై అంటించే అయస్కాంతాలు (Magnets) వల్ల.. విద్యుత్ వినియోగం పెరిగి.. కరెంటు బిల్లు భారీగా వస్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై ప్రముఖ ఫ్రిడ్జ్ తయారీ సంస్థలైన బాష్ (Bosch), ఎల్జీ (LG) ఫుల్ క్లారిటీ ఇచ్చాయి.

బాష్ ఏం చెప్పిందంటే?

ఫ్రిడ్జ్ డోర్లపై అయస్కాంతాలు అంటించడం వల్ల విద్యుత్ బిల్లు విపరీతంగా పెరుగుతుందని జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని బాష్ స్పష్టం చేసింది. మ్యాగ్నెట్స్ కు పవర్ వినియోగానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయితే అధిక మెుత్తంలో ఫ్రిడ్జ్ డోర్ పై మ్యాగ్నెట్లు పెట్టడం వల్ల.. ఫ్రిడ్జ్ పనితీరుపై ప్రభావం పడొచ్చని బాష్ ప్రతినిధులు తెలిపారు. ఫ్రిడ్జ్ డోర్ పై అధిక బరువు ఒత్తిడి పెరిగి.. ఫ్రిడ్జ్‌ సామర్థ్యం దెబ్బతినే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. పరిమితికి మించి.. ఫ్రిడ్జ్ డోర్ పై బరువు పెడితే.. దాని జాయింట్స్ బలహీన పడొచ్చని హెచ్చరించారు.

వాటికి అంత సీన్ లేదు

Advertisement

మరో ప్రముఖ విద్యుత్ సరఫరా సంస్థ ‘ఎండెసా’ (Endesa) కూడా నెట్టింట జరుగుతున్న ప్రచారంపై స్పందించింది. ఇళ్లల్లో వాడే మ్యాగ్నెట్ల నుండి వెలువడే అయస్కాంత బలాలు చాలా బలహీనంగా ఉంటాయని స్పష్టం చేసింది. అవి ఫ్రిజ్ డోర్ లోపలికి చొచ్చుకెళ్లి లోపలి సెన్సార్లను గానీ, దాని పనితీరును గానీ ఏమాత్రం ప్రభావితం చేయలేవని తెలియజేసింది. అటు వినియోగదారుల హక్కుల సంస్థ (OCU) కూడా ఇదే విషయాన్ని ధృువీకరించింది. ఇళ్లల్లో వాడే సాధారణ ఐస్‌కాంతాలకు ఫ్రిజ్ కరెంట్ వినియోగాన్ని మార్చేంత శక్తి ఉండదని తేల్చి చెప్పింది.

Also Read: ఆదర్శ కుటుంబం నుంచి సంపూర్ణ ఇంట్రడక్షన్ వీడియో.. డైలాగ్స్ అదుర్స్!

ఎల్‌జీ మాట కూడా ఇదే

Advertisement

అటు దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్ జీ సైతం ఈ పుకార్లను కొట్టిపారేసింది. ఫ్రిజ్ బయట అంటించే మ్యాగ్నెట్ల వల్ల కరెంట్ బిల్లు, ఫ్రిడ్జ్ పనితీరు, ఆహార పదార్థాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెగేసి చెప్పింది. ఒకవేళ ఫ్రిడ్జ్ డోర్ పై ఉన్న మ్యాగ్నెట్లను తొలగించినా.. కరెంటు బిల్లు ఏమాత్రం తగ్గదని ఎల్ జీ వర్గాలు స్పష్టం చేశాయి. ఫ్రిజ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం, డోర్ కు లీకేజీలు లేకుండా చూసుకోవడమే ద్వారానే అదనంగా అయ్యే విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చని వెల్లడించాయి.

Also Read: స్మార్ట్ ఫీచర్స్,ఎక్కువ స్పేస్! మీ ఇంటికి తగ్గ డబుల్ డోర్ ఫ్రిజ్‌లు

Related News

పవర్‌ఫుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. Sony Xperia 1 IX లోని స్పెషల్ ఫీచర్లు ఇవే!

Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు!

వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.13,000 ఆదా చేసుకునే ఛాన్స్, ఆఫర్ లిమిటెడ్!

తక్కువ ధరలో అదుర్స్ అనిపించే వాచ్ కావాలా? ఈ స్మార్ట్‌వాచ్ మిస్ కావద్దు!

80ల్లో ఫోన్ కాల్.. త్వరగా మాట్లాడకపోతే జేబు ఖాళీ, ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉంటే.. అదో స్టేటస్

రూ.30వేలలోపు బెస్ట్..కూకా Y74 ప్లస్ 55 ఇంచుల టీవీ రివ్యూ!

తక్కువ ధరలో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్.. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే

అంతరిక్షంలో అడుగుపెట్టి.. సొంత శాటిలైట్లతో సత్తా చాటి.. 80ల్లో ISRO అంటే ఫ్లవర్ కాదు ఫైర్!

Big Stories

Advertisement
×