Shami Daughter: ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీపై ప్రముఖ మత గురువు, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వి బరేల్వి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రంజాన్ మాసంలో షమీ రోజా పాటించకపోవడం, మ్యాచ్ సందర్భంగా ఎనర్జీ డ్రింక్ తాగడాన్ని మౌలానా షాబుద్దీన్ రజ్వి తీవ్రంగా తప్పుపట్టారు.
Also Read: KKR: KKRకు బిగ్ షాక్.. ఆ డేంజర్ ప్లేయర్ ఔట్ ?
మార్చ్ 6న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో మహమ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతూ కనిపించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. షరియత్ నియమాలు పాటించాలని సూచించారు. అంతేకాకుండా షమీ ఓ క్రిమినల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ విషయంపై షమీకి మద్దతుగా యావత్ దేశం నిలబడింది. దేశం కోసం క్రికెట్ ఆడుతుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మౌలానా షాబుద్దీన్ రజ్వికి సూచించారు.
అయితే ఇప్పుడు మరోసారి షమీ కూతురిని టార్గెట్ చేస్తూ షాబుద్దీన్ రజ్వి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మహమ్మద్ షమీ కూతురు ఇటీవల హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకుంది. హోలీ రోజు షమీ కూతురు ఐరా రంగులు పూసుకుని దిగిన ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో.. ఐరా హోలీ ఆడడాన్ని పెద్ద ఇష్యూ చేశాడు. పవిత్ర రంజాన్ మాసంలో ఐరా హోలీ ఆడడాన్ని తప్పుపట్టాడు.
ఐరా ని రంగులు పూసుకునేందుకు అనుమతి ఇచ్చిన తల్లి హాసిన్ జహ ని తిట్టి పోశాడు. “ఐరా లాంటి చిన్నారి రంజాన్ మాసం ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోవచ్చు. రంజాన్ విశిష్టత తెలియకుండా ఆ చిన్నారి హోలీ ఆడితే అది నేరం కాదు. కానీ ఐరా రంజాన్ పవిత్రత తెలిసి కూడా హోలీ ఆడి ఉంటే మాత్రం ఇది ఇస్లాంకి వ్యతిరేకం. షరియత్ తెలిసిన వారు హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం నేరం” అంటూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు మౌళి.
అయితే ఐరా విషయంలో మౌలానా షాబుద్దీన్ స్పందించిన తీరును చాలామంది తప్పుబడుతున్నారు. ఆ చిన్నారి ఏదో సరదాగా రంగులు పూసుకుంటే ఇంత రాద్ధాంతం చేయాలా అని మండిపడుతున్నారు క్రికెట్ అభిమానులు. అయితే కొంతమంది మాత్రం ఈ విషయంలో ఐరా తప్పు లేదని.. రంజాన్ మాసం అని తెలిసి కూడా ఆమె తల్లి హోలీ ఆడేందుకు అనుమతి ఇవ్వడం పెద్ద నేరమేనని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Akmal brothers: పాక్ మాజీ క్రికెటర్ల ఇంట్లో దొంగలు పడ్డారు..!
ప్రస్తుతం ఐరా తల్లి హసీన్.. మహమ్మద్ షమీతో విడాకులు తీసుకొని వేరుగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించిన భారత జట్టుకు షాబుద్దీన్ రజ్వి శుభాకాంక్షలు తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీం ఇండియా కెప్టెన్, ఆటగాళ్లకు, మహమ్మద్ షమీ కి హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేశారు మౌలానా షాబుద్దీన్ రజ్వి.