Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో భాగంగా మార్చి 25 మంగళవారం రోజు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ {Shreyas Iyer} జట్టు ప్రయోజనాల కోసం తన సెంచరీని మిస్ చేసుకున్న విషయం తెలిసిందే. ఓవైపు యంగ్ క్రికెటర్ శశాంక్ సింగ్ బౌండరీలు బాధితుండడంతో.. స్ట్రైక్ అతడికే అప్పగించాడు అయ్యర్. 97 పరుగుల వద్ద ఉన్నప్పటికీ సెంచరీ చేయాలనే ఆత్రుత శ్రేయస్ అయ్యర్ లొ కనిపించలేదు.
Also Read: Rishabh Pant: డకౌట్ తో కూడా పంత్ కోట్లు.. ఒక్క మ్యాచ్‌కు ఎంతంటే ?
వీలైనన్ని పరుగులు స్కోర్ బోర్డు మీద చేర్చాలని ప్రయత్నించాడు. ఇక శశాంక్ చేసిన పరుగులే పంజాబ్ విజయానికి కీలకంగా మారారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ మ్యాచ్ లో గుజరాత్ పై పంజాబ్ 11 పరుగుల తేడాతోనే విజయం సాధించింది. అయితే వ్యక్తిగత రికార్డులకోసం కాకుండా జట్టు విజయం కోసం ప్రయత్నించిన శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది.
ఇక శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్, దేశవాలి క్రికెట్, ఐపీఎల్ కాంట్రాక్ట్ ద్వారా బాగానే అర్జిస్తున్నాడు. కానీ ఆ మధ్య అతడి సెంట్రల్ కాంట్రాక్ట్ ని భారత క్రికెట్ నియంత్రణ మండలి {బిసిసిఐ} తొలగించింది. అయినప్పటికీ అతడు ఐపిఎల్ ద్వారా బాగానే అర్జిస్తున్నాడు. తొలిసారి 2015 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అయ్యర్ ని 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2018లో అది ఏడు కోట్లకు పెరిగింది.
ఇక ఇప్పుడు పంజాబ్ కింగ్స్ అతడిని 26.75 కోట్లకు దక్కించుకొని ఆ జట్టుకు కెప్టెన్ ని కూడా చేసింది. అయితే ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులకు సంబంధించిన జాబితా విడుదల కావలసి ఉంది. ఈ మేరకు ఈనెల 29న గౌహతి లో బీసీసీఐ సమావేశం కానున్నట్లు సమాచారం కానున్నట్లు సమాచారం. బీసీసీ సెక్రటరీ దేవజిత్ సైకియా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, తదితరులు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చిస్తారని టాక్.
Also Read: Sehwag: గిల్ వెస్ట్ ఫెలో… కెప్టెన్సీ కూడా రాదు?
ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ ని తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో తన బ్యాటింగ్ తో భారత జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించాడు అయ్యర్. దీంతో అతడు తిరిగి సెంట్రల్ కాంట్రాక్టుని పొందడం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనాప్పటికీ సెలెక్షన్ కమిటీ, ప్రధాన కోచ్ తో సంప్రదింపుల తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తుది జాబితాని అపెక్స్ కౌన్సిల్ ముందు ఆమోదం కోసం పెట్టబోతున్నారు. అప్పుడే అధికారికంగా పూర్తి సమాచారం తెలుస్తోంది. ఇక శ్రేయస్ అయ్యర్ తిరిగి తన సెంట్రల్ కాంట్రాక్ట్ ని పొందబోతున్నాడని తెలిసిన ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.