Jonty Rhodes: అంతర్జాతీయ క్రికెట్ లో బెస్ట్ ఫీల్డర్ ఎవరు..? అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు.. జాంటీ రోడ్స్ {Jonty Rhodes}. ఈ సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడు ఒకప్పుడు అబ్బురపరిచే ఫీల్డింగ్ విన్యాసాలతో ఆశ్చర్యపరిచేవాడు. మైదానంలో మెరుపు వేగంతో కదిలే జాంటీ రోడ్స్.. కళ్ళు చెదిరే డైవింగ్ క్యాచ్ లతో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఆ తరంలో అత్యుత్తమ ఫీల్డర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలిగిన తర్వాత ఫీల్డింగ్ కోచ్ గా అవతారం ఎత్తాడు.
Also Read: JioStar – ICC CT 2025: ఫైనల్ మ్యాచ్.. 10 సెకండ్ల యాడ్ కు ఇన్ని లక్షలా….?
ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా పని చేశాడు. అయితే ప్రస్తుతం ఇంటర్నేషనల్ మాస్టర్ టి-20 టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొన్నాయి. ఈ ఏడాది నుండే ఈ టోర్నీ తొలి సీజన్ ప్రారంభమైంది. అయితే ఈ లీగ్ లో ఆస్ట్రేలియా మాస్టర్స్ ఊహకందని ఊచకోత మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో జరిగిన తొలి రెండు మ్యాచ్ లలో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న ఆస్ట్రేలియన్ మాస్టర్స్.. తరువాతి రెండు మ్యాచ్లలోనూ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చింది.
మార్చి 7 శుక్రవారం రోజున సౌత్ ఆఫ్రికా మాస్టర్స్ తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా మాస్టర్ రికార్డ్ స్కోర్ సాధించింది. ఈ లీగ్ లోని 11వ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ జాక్వెస్ కల్లిస్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 260 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ 122 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
అలాగే ఫెర్గ్యూసన్ 85, బెన్ డంక్ 34 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అనంతరం ఆస్ట్రేలియా మాస్టర్స్ విధించిన 261 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో సౌత్ ఆఫ్రికా మాస్టర్ చతికిలబడింది. కేవలం 123 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి.. 137 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచ్ లో 55 ఏళ్ల జాంటీ రోడ్స్ {Jonty Rhodes} అద్భుతమైన క్యాచ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. షేన్ వాట్సన్ ఫ్రంట్ ఫుట్ షాట్ ఆడడంతో.. బంతి బౌండరీ వైపుకు వెళుతుంది.
కానీ అకస్మాత్తుగా జాంటీ రోడ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని బౌండరీ దాటకుండా గాల్లోకి డైవ్ చేశాడు. దీంతో అద్భుతమైన ఫిట్నెస్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 55 ఏళ్ల వయసు వచ్చిన ఇంకా తాను ఫీట్ గా ఉన్నానని తెలియజేశాడు. దీంతో జాంటీ రోడ్స్ కి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మరోవైపు ఈ లీగ్ లో షేన్ వాట్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ లీగ్ లో ఇప్పటికే మూడు సెంచరీలు సాధించిన వాట్సన్.. నాలుగు మ్యాచ్లలో 33 ఫోర్లు, 25 సిక్సర్లతో మొత్తంగా 355 పరుగులు చేశాడు.
THE FIELDING EFFORT OF JONTY RHODES AT THE AGE OF 55 IN IMLT20 🤯 pic.twitter.com/1Wpzs5KrgW
— Johns. (@CricCrazyJohns) March 7, 2025