BigTV English

Breast cancer: 2040 నాటికి పెరగనున్న రొమ్ము కాన్సర్ మరణాలు.. ఏటా 10 లక్షల మరణాలు

Breast cancer: 2040 నాటికి పెరగనున్న రొమ్ము కాన్సర్ మరణాలు.. ఏటా 10 లక్షల మరణాలు

Breast Cancer To Cause A Million Deaths By 2040: ప్రపంచవ్యాప్తంగా రొమ్ము కాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. రొమ్ము కాన్సర్ ఎక్కువగా మహిళల్లో వ్యాపిస్తుంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రేటు పెరుగుతోందని ఇటీవలి అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేశాయి, 2040 నాటికి రొమ్ము క్యాన్సర్  కేసులు, దాని వల్ల మరణాల రేటు చాలా రెట్లు పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.


2040 నాటికి రొమ్ము క్యాన్సర్ కారణంగా ప్రతి సంవత్సరం ఒక మిలియన్ మంది చనిపోతారని లాన్సెట్ కమిషన్ హెచ్చరించింది. ఇప్పుడు కూడా ఈ క్యాన్సర్ కారణంగా ఏటా 6-7 లక్షల మంది మహిళలు మరణిస్తున్నారు, ఈ మరణాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నివేదికలు తెలిపాయి.

Breast Cancer To Cause A Million Deaths By 2040
Breast Cancer To Cause A Million Deaths By 2040

లాన్సెట్ కమిషన్ నివేదిక ప్రకారం 2020 చివరి వరకు ఐదేళ్లలో సుమారు 7.8 మిలియన్ల (78 లక్షలకు పైగా) మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారని  దాదాపు 6.85 లక్షల మంది మహిళలు ఈ వ్యాధితో మరణించారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కేసులు 2020లో 23 లక్షల నుండి 2040 నాటికి 30 లక్షలకు పెరుగుతాయని అంచనా వేసింది.


Also Read: వానొచ్చే వరదొచ్చే.. మునిగిన దుబాయ్ ఎయిర్‌పోర్టు

ముఖ్యంగా ఈ కేసులు చాలా వరకు పేద, వర్దమాన దేశాల నుండి సంభవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ధనిక దేశాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆధునిక వసతులు, ప్రజల చైతన్యం కల్పించడం వల్ల మరణాల రేటును కొంత వరకు తగ్గించగలుగుతున్నారని నివేదిక కమిషన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన షార్లెట్ కోల్స్ వెల్లడించారు.

భారతీయ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు నిరంతరం పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దక్షిణాఫ్రిక వంటి దేశాల్లో 40 శాతం మంది కేన్సర్ బారినుండి బయటపడుతున్నట్లు నివేదికలు తెలిపాయి. ప్రజల్లో ఇంకా ఈ వ్యాధిపై అవగాహన పెంచడం, సరైన ఆహారం తీసుకోవడం, అధిక బరువును తగ్గించుకోవడం, మధ్యం వినియోగం నియంత్రణ, వంటి చేయడం వల్లన కాన్సర్ బారిన పడే అవకాశాలు కొంత వరకు నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×