MI vs DC: ఐపీఎల్ 2025లో వరస విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ కి బ్రేక్ పడింది. ముంబై ఇండియన్స్ ఫీల్డర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ కి ఈ 18వ సీజన్ లో తొలి ఓటమి ఎదురైంది. ఐపీఎల్ {IPL} లో ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
Also Read: Virat Kohli: ఫ్యాన్స్ కు షాక్.. గ్రౌండ్ లోనే గుండె పట్టుకున్న కోహ్లీ.. అసలేమైంది..?
అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 193 పరుగులకే కుప్ప కూలింది. దీంతో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. మైదానంలో లేకపోయినా.. డగౌట్ లో కూర్చుని ఢిల్లీ పతనాన్ని శాసించాడు. కేవలం ఒకే ఒక్క నిర్ణయంతో ఫలితాన్ని రాబట్టాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ తన బ్యాట్ తో అద్భుతాలు చేయలేకపోయినప్పటికీ.. ఓ అద్భుతమైన పాచికతో మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ తర్వాత డగౌట్ నుంచి రోహిత్ శర్మ మ్యాచ్ ని ఊహించని మలుపు తిప్పాడు. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనేకి రోహిత్ శర్మ ఇచ్చిన సలహాతో ఎవరూ ఊహించని ఫలితం దక్కింది. ఈ విజయంలో బంతిని మార్చడం కీలకంగా వ్యవహరించింది. 13వ ఓవర్ తర్వాత బంతిని మార్చమని రోహిత్ శర్మ జయవర్ధనే కి సలహా ఇచ్చాడు.
కొత్త బంతితో.. వికెట్ రెండు చివర్ల నుండి స్పిన్నర్లను బరిలోకి దింపాలని సూచించాడు. ఆ సమయానికి లక్ష్యానికి దగ్గరైన ఢిల్లీ జట్టు.. రోహిత్ శర్మ నిర్ణయం తర్వాత అధ్వానంగా తయారైంది. కొత్త బంతికి మంచి గ్రిప్ దొరకడం వల్ల కర్ణ్ శర్మ దానిని అనుకూలంగా మార్చుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్ లోనే కర్ణ్ శర్మ.. స్టబ్స్ ని పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత కే.ఎల్ రాహుల్ ని అవుట్ చేసి మ్యాచ్ ని ముంబై వైపుకు తిప్పాడు.
Also Read: Rohit Sharma: కరుణ్ నాయర్ పై బుమ్రా కుట్రలు.. రోహిత్ రియాక్షన్ అదుర్స్
ఇలా రోహిత్ శర్మ నిర్ణయం ముంబై విజయంలో కీలకపాత్ర పోషించింది. కొత్త ఐపీఎల్ రూల్ ప్రకారం.. రాత్రివేళ జరిగే మ్యాచ్లలో రెండో ఇన్నింగ్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న జట్టు కెప్టెన్ కి బంతిని మార్చుకునే అవకాశం ఉంటుంది. మంచు కారణంగా లేదా బంతి షేప్ అవుట్ కారణంగా పట్టుకోల్పోతున్న సమయంలో బంతిని మార్చుకోవచ్చు. అయితే ముందుగా ఫీల్డ్ అంపైర్ కి రిక్వెస్ట్ పంపాలి. దానికి అంపైర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కొత్త బంతిని తీసుకోవచ్చు. ఇలా రోహిత్ శర్మ మరోసారి తన నాయకత్వ లక్షణాలను మైదానం బయట నుండి నిరూపించాడు.
#MI's spinners 𝙩𝙪𝙧𝙣𝙚𝙙 the game on its head! 🙌
Here’s how the experts broke down their coaching staff's spot-on call to bring them in at just the right moment 🗣#IPLonJioStar 👉 #LSGvCSK | MON, 14th APR, 6:30 PM LIVE on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/POK9x6m9Qc
— Star Sports (@StarSportsIndia) April 13, 2025