Kavya Maran – Run-Out: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మ్యాచ్ ఆడుతోంది. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లను కట్టడి చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లు ఆడి ఏడు వికెట్లు నష్టపోయి 133 పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాద్ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో… తక్కువ స్కోరుకు పరిమితమైంది ఢిల్లీ క్యాపిటల్స్.
Also Read: MLA Kaushik meets KL Rahul: రాహుల్ ను కలిసిన కౌశిక్ రెడ్డి..పింక్ కండువా కప్పేసాడు !
కావ్య పాప రియాక్షన్స్ అదుర్స్
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఇవాల్టి మ్యాచ్ లో హైదరాబాద్ ఓనర్ కావ్య పాప రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు విజ్రజ్ నిగమ్ రన్ అవుట్ అయ్యాడు. స్టబ్స్ అలాగే విప్రజ్ మధ్య ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ మిస్ కావడంతో… ఇద్దరు కూడా వికెట్ కీపర్ ఈశాన్ కిషన్ వైపు పరిగెత్తారు. ఈ నేపథ్యంలోనే బంతి బౌలర్ జీసన్ అన్సారీకి హైదరాబాద్ ప్లేయర్ అనికేత్ వర్మ వేశాడు. ఈ నేపథ్యంలో వెంటనే వికెట్లను బాదేశాడు బౌలర్ జీసన్.
అయితే ఈ రన్ అవుట్ అయిన నేపథ్యంలో… ప్రేక్షకుల మధ్య ఉన్న కావ్య మారన్…. వేసేయండిరా అంటూ తెలుగు హీరోలు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. తన చేతులతో సైగలు చేసి… అందరినీ ఆకట్టుకున్నారు కావ్య మారన్. దీంతో కావ్య మారన్ చేసిన సైగలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా హైదరాబాద్ జట్టు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కావ్య పాప… చాలా ఎక్సైటింగ్ గా కనిపించారు. హైదరాబాద్ ప్లేయర్లు కూడా ఇవాళ అద్భుతంగా రాణించిన నేపథ్యంలో… కావ్య పాప చాలా ఎంజాయ్ గా కనిపించారు.
Also Read: Miss World Contestants: ఐపీఎల్ మ్యాచ్ లకు మిస్ వరల్డ్ పోటీదారులు.. ఉప్పల్ లో ఫ్యాన్స్ కు పండగే
SHE'S SO CUTE 😭💕 #kavyamaran pic.twitter.com/EztZS85OLv
— ishki'swinterdiary•°☆ (@offoishuu) May 5, 2025
🫴🏻💥💥 pic.twitter.com/W4E2O3WsXg
— kavya Maran (@Kavya_Maran_) May 5, 2025