BigTV English

Israel Hezbollah Attacks: హెజ్బుల్లాపై భారీస్థాయిలో దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్.. అదే స్థాయిలో హెజ్బుల్లా రివర్స్ అటాక్

Israel Hezbollah Attacks: హెజ్బుల్లాపై భారీస్థాయిలో దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్.. అదే స్థాయిలో హెజ్బుల్లా రివర్స్ అటాక్

Israel Hezbollah Attacks| లెబనాన్ లోని సాయుధ పోరాట దళం హెజ్బుల్లా, ఇజ్రాయిల్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలైంది. ఆదివారం ఉదయం ఇజ్రాయిల్ సైన్యం.. లెబనాన్ లోని హెజ్బుల్లా మిలటరీ స్థావరాలపై భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల గురించి ఇజ్రాయిల్ సైన్యధాకారులు మాట్లాడుతూ..”హెజ్బుల్లా త్వరలో ఇజ్రాయిల్ పౌరులను టార్గెట్ చేస్తూ దాడులు చేయబోతోందనే మాకు సమాచారం అందడంతో ముందస్తు చర్యగా వైమానికి దాడులు చేశాం” అని తెలిపారు.


అయితే హెజ్బుల్లా మిలిటెంట్లు కూడా వెంటనే అదే స్థాయిలో ఇజ్రాయిల్ పై డ్రోన్ దాడులు చేశారు. దాదాపు 320 కత్యూషా రాకెట్లు డ్రోన్ల ద్వారా ఇజ్రాయిల్ లోని ఐరన్ డోమ్ పరికరాలున్న మిలిటీరీ స్థావరాలపై విరుచుకు పడ్డాయని సమాచారం.

హెజ్బుల్లా మిలిటెంట్లు కూడా పెద్ద స్థాయిలో దాడులు చేయడం వల్ల ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యావోవ్ గల్లాంత్ తో ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అత్యవసర సమావేశం చేశారు. ఆ తరువాత ఆదివారం మధ్యాహ్నం కూడా అత్యవసర కేబినెట్ మీటింగ్ చేయనున్నారని సమాచారం.


గాజా యుద్ధం ముగించాలని అమెరికా, కతార్ దేశాలు.. ఇజ్రాయిల్ పై ఒత్తిడి చేయడం.. అందుకు ఇజ్రాయిల్ పైకి అంగీకరించినా.. మళ్లీ గాజాలోని శరణార్థి శిబిరాలపై దాడులు చేస్తుండడంతో హమాస్ కు మద్దుతుగా హెజ్బుల్లా.. ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించింది. ఈ క్రమంలో లెబనాన్ సరిహద్దులకు సమీపంగా ఉన్న ఇజ్రాయిల్ భూభాగం గోలాన్ హైట్స్ పై రాకెట్ దాడులు చేసింది. ఆ తరువాత ఇజ్రాయిల్ కూడా లెబనాన్ లోని పలు హెజ్బుల్లా స్థావరాలపై దాడుల చేసింది. జూలై లో జరిగిన దాడుల్లో హెజ్బుల్లా కమాండర్ ఫవాద్ షుకుర్ తో పాటు ఇద్దరు పౌరులు చనిపోయారు.

విమానాలు రద్దు
ఇజ్రాయిల్, హెజ్బుల్లా మధ్య దాడులు తీవ్రం కావడంతో వారం రోజుల క్రితమే లెబనాన్ లోని ఏకైక ఎయిర్ పోర్టుకు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే తాజాగా ఇజ్రాయిల్ పై కూడా దాడులు మొదలు కావడంతో ఇజ్రాయిల్ లోని బెన్ గురియన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకి వెళ్లాల్సిన విమాన సర్వీసులన్నీ రద్దై పోయాయి. అక్కడి నుంచి బయలుదేరాల్సిన విమానాలు కూడా నిలిచిపోయాయి.

యుద్ధం మొదలు కావడంతో లెబనాన్, ఇజ్రాయిల్ సరిహద్దు పట్టణాల్లో నివసించే వేలాది మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. దీంతో సరిహద్దు పట్టాణాలు ఖాళీగా మారిపోయాయి.

Also Read: టెలీగ్రామ్ యాప్ సిఈవో పావెల్ డురోవ్ అరెస్ట్.. ఏం చేశాడంటే..

ఇరాన్ లో ఇటీవల హమాస్ అధ్యక్షుడు ఇస్మాయిల్ హానియ్ ని ఇజ్రాయిల్ హత్య చేసింది. ఈ ఘటన తరువాత మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయోతుల్లా ఖమేనీ..ఇజ్రాయెల్ పై త్వరలోనే పూర్తి స్థాయిలో దాడులు చేస్తామని ప్రకటించారు. కానీ కొత్త అధ్యక్షడు పెజెష్కియన్ ఇజ్రాయిల్ పై నేరుగా దాడి చేయడాన్ని వ్యతిరేకించడంతో ప్రస్తుతాన్ని యుద్ధం వాయిదే పడినట్లే అని అంతా అనుకుంటున్న తరుణంలో హెజ్బుల్లా పై ఇజ్రాయిల్ దాడులు చేయడం.. హెజ్బుల్లా కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది.

అయితే హెజ్బుల్లాకు ఇరాన్ ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు అన్ని విధాలుగా సహాయం చేస్తోంది. మరోవైపు ఇజ్రాయిల్ కు సహాయంగా అమెరికా వైమానికి దళం సిద్ధంగా ఉంది. రెండు వైపులా బలమైన దేశాల మద్దతు ఉండడంతో ఈ యుద్ధం మహావినాశనానికి దారి తీసే అవకాశాలున్నాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×