Big Stories

LSG Owner Angry on KL Rahul: కేఎల్ రాహుల్‌పై ఆగ్రహం.. లక్నో యాజమానికి ఏమైంది..? ఏ విషయంలో..?

LSG Owner Sanjiv Goenka’s Angry on Captain KL Rahul: హైదరాబాద్ వేదికగా బుధవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఘోరంగా ఓటమి పాలైంది. సన్‌రైజర్స్ దూకుడుకు స్టేడియంలో ఒకటే హంగామా. 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది లక్నో సూపర్ జెయింట్స్. మ్యాచ్ జరుగుతున్నప్పుడే వికెట్ల తీయకపోవడంతో బౌలర్లపై కాస్త అసహనం వ్యక్తం చేశాడు కెప్టెన్ కేఎల్ రాహల్.

- Advertisement -

సన్‌రైజర్స్ దూకుడు చూసి మైదానంలో ప్రేక్షకుడైపోయాడు కేఎల్ రాహల్. కేవలం 10 ఓవర్లలోపే మ్యాచ్ ముగియడంతో షాకయ్యాడు కెప్టెన్. మ్యాచ్‌ గురించి కోచ్‌తో కెఎల్ రాహుల్ చర్చించకముందే ఎంట్రీ ఇచ్చేశారు లక్నోసూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా.

- Advertisement -

అసలే మ్యాచ్ పోయిందని బాధ ఏమాత్రం లేకుండా తన కోపాన్ని కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై కక్కేశారాయన. ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా, ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు గోయెంకా. అదే సమయంలో కోచ్ జస్టిన్ లాంగర్ వచ్చినప్పటికీ యాజమాని శాంతించలేదు. కేఎల్ రాహుల్‌కు కాస్త అసౌకర్యంగా అనిపించింది. చివరకు అక్కడి నుంచి గోయెంకా తప్పుకున్నారు.

Also Read: ఆకాశమే హద్దుగా చెలరేగిన హైదరాబాద్.. ఘోర పరాజయాన్ని చూసిన లక్నో

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. వీడియో అయితే బయటకు వచ్చింది కానీ, గోయెంకా.. కెప్టెన్‌తో ఏమన్నారన్నది మాత్రం అందులో క్లియర్‌గా వినిపించలేదు. కాకపోతే ఆయన ఫేస్‌లోని హావభావాలను గమనించారు క్రికెట్ లవర్స్. దీంతో ఎవరికి నచ్చినట్టువాళ్లు ఊహించారు.. రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ తరహా సన్నివేశాలను కెమెరాలో బంధించి, దాన్ని చూపించడం పెద్ద తప్పుగా వర్ణిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంపై ఐపీఎల్‌లో ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాలి.

టీ20 క్రికెట్ చరిత్రలో 150కి పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా పూర్తి చేసిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. హైదరాబాద్ జట్టుకు తొలి పది ఓవర్లలో చేసిన అత్యధిక స్కోరు ఇదే. ఇక పవర్ ప్లేలో లక్నో జట్టు చేసిన అత్యల్ప స్కోరు రెండు వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది.

Also Read: CSK vs GT IPL 2024 Preview: సీఎస్కే ముందడుగు వేస్తుందా?.. నేడు గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News