Benefits of Bharat Ratna : భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు. ఇది 1954లో స్థాపించబడింది. ముఖ్యంగా విభిన్న రంగాల్లో వ్యక్తులు చేసిన అసాధారణ సేవ, పని తీరును ప్రశంసిస్తూ ఈ అవార్డును ప్రతీ సంవత్సరాం ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కేవలం భారతీయులకు మాత్రమే కాదు.. భారతీయులు కాని వారు కూడా ఈ అవార్డును అందుకోవచ్చు. ఈ అవార్డు అందుకున్న వారిలో ప్రముఖులు డా.బీ.ఆర్ అంబేద్కర్, మదర్ థెరిసా, సీ.వీ.రామన్, ఏ.పీ.జే.అబ్దుల్ కలాం, లతా మంగేష్కర్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వంటి వారు చాలా మంది ఉన్నారు. 2025 లో భారత అవార్డులను మాత్రం ఇవ్వలేదు. 2024లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ఉప ప్రధాని ఎల్.కే.అద్వానీ, హరిత విప్లవ పితా మహుడు ఎం.ఎస్. స్వామి నాథన్, మాజీ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాగూర్ కి భారత రత్న అవార్డు దక్కింది. అయితే భారత రత్న అవార్డు గ్రహీతలకు లభించే సౌకర్యాలు, బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : AIR Webseries: ఆల్ ఇండియా ర్యాంకర్స్ మూవీలోనూ CSK… ఎల్లో జెర్సీ అంటూ !
భారత రత్న అవార్డు బెనిఫిట్స్ :
అవార్డు ఎలా ఉంటుంది
భారత రత్న అవార్డును కాంస్యంతో తయారు చేస్తారు. దీనిని ప్రఖ్యాత కళాకారుడు నందలాల్ బోస్ రూపొందించారు. ఈ పురస్కారం రావి చెట్టు ఆకు ఆకారంలో ఉంటుంది. దానిపై ఒకవైపు ప్లాటినంతో చెక్కిన సూర్యుడి చిత్ర, కింద దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. పతకానికి మరోవైపు అశోక స్థంభం, కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది.
భారతరత్న కి ఎంపిక విధానం
భారతరత్న అవార్డుకి ఎంపిక చేసే వ్యక్తుల పేర్లను ప్రధానమంత్రి ఎంపిక చేసి రాష్ట్రపతికి పంపిస్తారు. రాజకీయాలు, విద్య, సైన్స్, ఆర్ట్స్, సాహిత్యం, క్రీడలు, సామాజిక సేవ, శాంతి వంటి వివిధ రంగాల్లో ప్రతిభ విశిష్ట సేవలు అందించిన వారిని ఈ అవార్డుకి జాతీయతతో సంబంధం ఉండదు. విదేశీయులకు కూడా భారతరత్న అవార్డు ప్రకటిస్తారు.