Illu Illalu Pillalu Today Episode july 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదకు నిజం తెలిసిందని కంగారు పడుతుంది.. ప్రేమ వల్లి అక్కను చూస్తుంటే ఏదో టెన్షన్ పడుతున్నట్లు అనిపిస్తుంది అని అంటుంది.. దానికి వల్లి నేను టెన్షన్ పడుతున్నానా ఎందుకు టెన్షన్.. ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఉత్సాహంగా ఉన్నాను చూడండి అని అంటుంది. నువ్వు సంతోషించే విషయం ఒకటి చెప్పనా మీ నాన్నగారిని మేము మున్సిపల్ ఆఫీసు దగ్గర సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతుంటే కలిసాము అని అంటారు. ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. ఫైనాన్స్ బిజినెస్ అంటే కేవలం బిజినెస్ గురించి మాట్లాడాలి ఆయన మాత్రం పల్లీల్లో చట్నీ ఎలా వేయాలి.
చట్నీలో బెల్లం వేస్తే టేస్ట్ అదిరిపోతుంది ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది అని తిరుపతి అంటాడు. ఇంత ఫ్రాడ్ ఫ్యామిలీని అస్సలు అనుకోలేదు. మీరు నిజంగానే ఫ్రాడ్ ఫ్యామిలీ బావ వీళ్లు.. చెప్పమ్మా చెప్పు అని తిరుపతి శ్రీవల్లిని అడుగుతాడు. శ్రీవల్లి నోట మాట రాకుండా ఉంటుంది. అటు రామరాజు కూడా ఏంటమ్మా శ్రీవల్లి మీ నాన్న ఫైనాన్స్ బిజినెస్ అన్నావు కదా ఇడ్లీలు వ్యాపారం ఏంటి అని అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. ధీరజ్ కోసం ప్రేమ కష్టపడుతున్న విషయాన్ని చెప్పకుండా షర్టుతో మాట్లాడుతూ ఉంటుంది. నేను డాన్స్ క్లాస్ నేర్పిస్తూ నీకు అండగా ఉండాలని అనుకుంటున్నాను. నువ్వు ఏమన్నా పర్లేదు ఎవరేమన్నా పర్లేదు అని మాట్లాడటం చూసి ధీరజ్ ప్రేమకు నిజంగానే పిచ్చి పట్టిందేమో అని అనుకుంటాడు. నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు లేదా ఫోన్ చేసి మాట్లాడొచ్చు.. కానీ ఇలా చొక్కా తో మాట్లాడటం ఏంటి అని అడుగుతాడు.. ధీరజ్ కు ప్రేమ పై డౌట్ వస్తుంది. కానీ ఏదోకటి చెప్పి తప్పించుకుంటుంది.
నర్మదా సాగర్ ఇద్దరూ అర్ధరాత్రి దొంగగా లాంతరు తీసుకొని బయటకొస్తారు. అది చూసిన శ్రీవల్లి కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెనకాలే వస్తుంది. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అంటే సాగర్ కు చదువు చెప్పిందా? ఎందుకు ఇప్పుడు చదువుతున్నారు. వీరిద్దరి మేటర్ మీ ఇంట్లో వాళ్లకి కచ్చితంగా తెలిసేలా చేయాలని దొంగ దొంగ అని అరుస్తుంది. ఇంట్లోని వాళ్లంతా హాల్లోకి వస్తారు. ఆ తర్వాత తిరుపతి రామ రాజు మధ్య కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దొంగ ఎక్కడా అంటూ కర్రపట్టుకుని వస్తాడు రామరాజు. తీరా బయటకు వెళ్లేసరికి అక్కడ నర్మద, సాగర్‌లు బయట కనిపిస్తారు. సాగర్ చదువుతూ కనిపిస్తే.. నర్మద ఫోన్‌లో పాటు వింటూ ఉంటుంది. అలా రామరాజు కంట్లో పడేట్టు చేస్తుంది శ్రీవల్లి..
సాగరు నర్మదా ఇద్దరు కలిసి బయట కూర్చుని చదువుతున్నట్లు చూసి షాక్ అవుతారు. అరె నడిపోడా అర్ధరాత్రి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా అని రామరాజు అడుగుతాడు.. అది నాన్న అది అని సాగరు టెన్షన్ పడుతూ ఉంటాడు. శ్రీవల్లి నా కడుపు మంట ఇప్పుడు చల్లారింది నాకు చాలా హాయిగా ఉంది అని మనసులో అనుకుంటుంది. లేకపోతే నన్ను ఇరికించాలని చూస్తుందా బాగా ఇరుక్కుంది ఇప్పుడు ఏం చెప్తాదో చూడాలి అని అనుకుంటుంది. ఇక తర్వాత రోజు ఉదయం ప్రేమ తన పుట్టింటి వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటుంది.
Also Read: వెంకీకి జోడి కుదిరింది.. టైటిల్ .. గురూజీది పెద్ద ప్లానే..!
ప్రేమ బాధను చూసి తట్టుకోలేక పోయిన ధీరజ్ మీ ఇంటి వాళ్ళని చూడాలనిపిస్తుందా..? వెళ్తావా అయితే మీ ఇంటికి అని అంటాడు. ప్రేమ ఎంత చెప్తున్నా కూడా వినకుండా ధీరజ్ ప్రేమను బయటకు తీసుకొస్తాడు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్తుందా? ధీరజ్ పై అరుస్తుందా? చూడాలి.. ఏది ఏమైనా సోమవారం ఎపిసోడ్ బాగా ఆసక్తిగా ఉండబోతుందని అర్థమవుతుంది.