Wimbledon : సాధారణంగా వింబుల్డన్ ప్రతీ సంవత్సరంలో లండన్ లో జరుగుతుంటుంది. మనం ప్రతీ యేటా చూస్తూనే ఉంటాం. ప్రపంచంలో నిర్వహించే నాలుగు గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ లో వింబుల్డన్ ఒకటి. ముఖ్యంగా వింబుల్డన్ లో పలు సాంప్రదాయాలను పాటిస్తుంటారు. ఇందులో ఆటగాళ్లు అందరూ తెల్లని దుస్తులు, వైట్ షూస్ ధరించాల్సిందే. వాస్తవానికి వింబుల్డన్స్ ఛాంపియన్ షిప్ టెన్నీస్ నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లలో అతి పురాతమైనది. పురుషుల టోర్నమెంట్ ని జెంటిల్ మెన్.. మహిళల టోర్నమెంట్ ని లేడీస్ అని పిలుస్తుంటారు. వాస్తవానికి వింబుల్డన్ పోటీలు ఆడేవారు తప్పకుండా డ్రెస్ కోడ్ వేసుకోవాల్సిందే. వైట్ డ్రెస్ లేనిది ఇందులో పాల్గొనడానికి అర్హత లేదు. డ్రెస్ కోడ్ లో తెల్ల రంగు ఉండటానికి కూడా ఓ కారణం ఉందట. అది ఏంటంటే..?
Also Read : Radhika Yadav Shot dead : యంగ్ టెన్నిస్ ప్లేయర్ రాధికాను హత్య చేసిన తండ్రి.. కారణం ఇదే
తెల్ల డ్రెస్ కి కారణం ఇదే..
1880లో ఈ డ్రెస్ కోడ్ వాడినప్పుడు చెమట మరకలు వికారంగా కనిపించేవి. రంగు రంగుల దుస్తులు ధరిస్తే.. ఒక్కో రంగు దుస్తులపై ఒక్కోలా కనిపించడంతోనే.. ఈ తెల్ల రంగును అప్పుటి నుంచి వాడుతున్నారు. వాస్తవానికి మిగతా రంగుల్లో చెమట కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. వాటిని తగ్గించడానికి తెలుపు రంగును ధరించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రంగును వింబుల్డన్ టోర్నమెంట్ లో డ్రెస్ కోడ్ వాడటం విశేషం. దాదాపు ఒక శతాబ్దానికి పైగా ఇది వింబుల్డన్ లో భాగంగా ఉన్నప్పటికీ పూర్తిగా తెల్లగా ఉండే దుస్తుల కోడ్ ఆటగాళ్లలో ప్రాచుర్యం పొందలేదు. దీనికి అత్యంత తీవ్రమైన సందర్భం ఏంటంటే..? సూపర్ స్టార్ ఆండ్రీ అగస్సీ 1988 నుంచి 1990 వరకు వింబుల్డన్ లో ఆడటానికి నిరాకరించాడు. ఎందుకు అంటే డ్రెస్ కోడ్ అతను ధరించే అత్యంత సౌకర్యవంతమైన మెరిసే దుస్తులను ధరించకుండా నిరోధించింది.
వింబుల్డన్ లో ఉపయోగించే బంతి..
అన్నీ సీజన్లలో అత్యుత్తమ పురుషుల టెన్నీస్ ఆటగాడిగా విస్తృతంగా పరిగణించబడే వ్యక్తి రోజర్ పెదరర్ కూడా డ్రెస్ కోడ్ కి అతీతంగా లేడు. ఎందుకంటే అతను 2013లో ఆరెంజ్-తెల్లటి షూ ధరించడంతో అతన్ని మందలించారు. అతను షూస్ తన తరువాత మ్యాచ్ లో మార్చాడు. వాస్తవానికి వింబుల్డన్ లో నెమ్మదిగా బౌన్స్ అయ్యే బంతిని మాత్రమే ఉపయోగిస్తారు. రెగ్యులేషన్ లాన్ -టెన్నిస్ కోర్టుల పరిమాణంలో సగం ఉన్న కోర్టులు మొదట 39/18 అడుగులు ఉంటుంది. అంటే 11.9/5.5 మీటర్లు. రెగ్యులేషన్ టెన్నీస్ కోర్టు పరిమాణంలో నాలుగో వంతు ఉండేవి. పెద్దలు 44/20 అడుగులు కొలిచే కోర్టును ఉపయోగించారు. 1959లో యునైటేడ్ స్టేట్స్ ప్యాడిల్ టెన్నిస్ అసోసియేషన్ కోర్టును 50/20 అడుగులకు విస్తరించింది. అలాగే ఆటను వేగవంతం చేసేందుకు బంతి నియమాలను సవరించింది. డానికి బంతిని మరియు నియమాలను సవరించింది. ఇక అప్పటి నుంచి ఆట నియమాలు.. అనుకూలంగా సవరిస్తూనే ఉన్నారు. స్కోరింగ్ టెన్నీస్ లాగానే ఉంటాయి. పెద్దలకు ఒక సర్వ్ మాత్రమే అనుమతించబడుతుంది. అది తప్పు అయితే సర్వర్ పాయింట్ ని కోల్పోతాడు. పిల్లలు రెండు సర్వ్ లను ఓవర్ హ్యాండ్ గా తీసుకొని చిన్న కోర్టులో ఆడవచ్చు. టెన్నీస్ ఆటలో రకరకాల మార్పులు తీసుకొచ్చారు.
?igsh=MXAweW8ycHczYzBsYg==