KKR VS SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో ఇవాళ కోల్కత్తా రైడర్స్ జట్టు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్.. వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో టాస్ ప్రక్రియ ఉంటుంది.
Also Read: RCB VS GT: వరుస విజయాలకు బ్రేక్… పాయింట్స్ టేబుల్ లో కిందికి పడిపోయిన RCB !
సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య రికార్డులు
సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచ్లు జరిగాయి. అయితే ఈ 28 మ్యాచ్లో కంప్లీట్ గా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన కోల్కతా నైట్ రైడర్స్ ఆదిపత్యం చెలాయించింది. 28 మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా 19 మ్యాచ్ లో విజయం సాధించింది. అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం కేకేఆర్ పై 9 మ్యాచ్లో విజయం సాధించడం జరిగింది. ఈ రెండు జట్ల మధ్య హైయెస్ట్ స్కోర్ 228 పరుగులు. అది కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చేసింది కావడం విశేషం. అలాగే లోయస్ట్ స్కోర్ 101. ఈ పరుగులు కేకేఆర్ చేసింది.
హైదరాబాద్ జట్టుకు డేంజర్ ప్లేయర్ దూరం
ఇవాళ కేకేఆర్ తో హైదరాబాద్ మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే కేకేఆర్ వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో డేంజర్ ప్లేయర్ అనికేత్ శర్మ దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. అతనికి మొన్నటి మ్యాచ్లో గాయమైందని సమాచారం అందుతోంది. ఆ గాయం కాస్త ప్రాక్టీస్ సమయంలో తీవ్రతరమైందని అంటున్నారు. దీంతో ఇవాల్టి మ్యాచ్లో అనికేత్ శర్మ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన దుమ్ము లేపాడు అనికేత్ శర్మ. అయితే.. అలాంటి ప్లేయర్ ఇవాళ.. ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అట. నిజంగానే అతను ఆడకపోతే సన్రైజర్స్ హైదరాబాద్ కు షాక్ తగిలే ఛాన్స్ ఉంది.
Also Read:Dhanashree Verma: క్రికెటర్ కు విడాకులు…హైదరాబాద్ కు పారిపోయిన కిలాడీ లేడీ ?
సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాబబుల్ XII: సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్ (WK), అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ XII: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అనికేత్ వర్మ ( Doubt), అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, రాహుల్ చాహర్/జీషన్ అన్సారీ, ఆడమ్ జంపా