E-Paper
Advertisement

హుండీ ఆదాయం కోసం నకిలీ దేవాలయం… ఓటీటీలో ఆకట్టుకుంటున్న మలయాళ డార్క్ కామెడీ థ్రిల్లర్

హుండీ ఆదాయం కోసం నకిలీ దేవాలయం… ఓటీటీలో ఆకట్టుకుంటున్న మలయాళ డార్క్ కామెడీ థ్రిల్లర్
Advertisement

Comedy Thriller movie on OTT : మలయాళ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు క్రేజీగా చూస్తున్నారు. ఇప్పుడు ఓటీటీలో వీటిని చూస్తూ తెగ ఆనందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో మలయాళ మూవీ ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తోంది. ఇప్పటికే థియేటర్లలో మలయాళ ఆడియన్స్‌ను మెప్పించిన ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఈ డార్క్‌ కామెడీ థ్రిల్లర్‌ మూవీ పేరు ‘భరతనాట్యం 2 మోహినియాట్టం’ (Bharathanatyam 2 Mohiniyattam). ఇది 2024 లో వచ్చిన ‘భరతనాట్యం’ సినిమాకి సీక్వెల్‌ గా రువందనది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ.40 కోట్లు వసూలు చేసి హిట్ కేటగిరీలో నిలిచింది. ఒక నకిలీ దేవాలయం చుట్టూ తిరిగే ఈ కథ చాలా ఆసక్తిగా సాగుతుంది కూడా. ఈ సినిమాను చూస్తే మరోసారి మలయాళ మూవీ స్టైల్ కనబడుతుంది.

‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో స్ట్రీమింగ్

‘భరతనాట్యం 2 మోహినియాట్టం’ డార్క్‌ కామెడీ థ్రిల్లర్‌ మూవీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో మే 8 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. కృష్ణదాస్‌ మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిజు కురుప్‌, సూరజ్‌ వెంజరమూడు, జగదీశ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. సైజు కురుప్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి థామస్ తిరువల్లా ఫిల్మ్స్ దీనిని నిర్మించాయి. ఈ సినిమా 2026 ఏప్రిల్ 10న విషు పండుగ కానుకగా థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు దాదాపు 40 కోట్లు వసూలు చేసి కమర్షియల్ సక్సెస్‌ సాధించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక సైజు కురుప్ కెరీర్‌లో ఇది 150వ సినిమా కావడం విశేషం.

స్టోరీ ఏమిటంటే

Advertisement

భరతన్ నాయర్ అనే ముసలాయన పోతూ పోతూ తన మొదటి పెళ్లాం పిల్లలకి పెద్ద తలనొప్పి తెచ్చిపెడతాడు. అతను శ్రీకండపురంలో రహస్యంగా ఇంకో కాపురం పెట్టి, అక్కడ బోలెడన్ని పంచాయితీలు చేసి చచ్చిపోతాడు. ఆ రెండో కుటుంబం తిండికి లేక ఇబ్బంది పడుతుంటే, మొదటి పెళ్లాం కొడుకు శశి (సైజు కురుప్) తన కుటుంబంతో కలిసి ఆ పంచాయితీ తెంచడానికి అక్కడికి వెళ్తాడు. తీరా వెళ్తే, ఆ ఊళ్లో ఉన్న గోవిందరాజ్ (సూరజ్ వెంజారమూడు) అనే ఒక కిలాడీ వ్యక్తి, అక్కడి లోకల్ గుడికి సంబంధించిన పాత గుట్టు ఒకటి పట్టుకుని శశి కుటుంబాన్ని గట్టిగా బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెడతాడు.

అటు డబ్బులు కట్టలేక, వాడి టార్చర్‌ భరించలేక ఈ ఫ్యామిలీ తలపట్టుకున్న టైమ్‌లో, ఊహించని విధంగా శశి ఫ్యామిలీ చేతిలో గోవిందరాజ్ చచ్చిపోతాడు. దాంతో కథ మొత్తం రివర్స్ అవుతుంది. పోలీసులకి దొరక్కుండా, ఆ శవాన్ని మాయం చేయడానికి ఈ ఫ్యామిలీ అంతా కలిసి చేసే హంగామా, పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. ఒక పక్క చావు భయం, ఇంకోపక్క శవాన్ని దాచే క్రమంలో ఈ కథ సాగుతుంది. శవాన్ని ముక్కలు చేసి మాయం చేయాలనుకుంటుంది ఆ ఫ్యామిలీ. అయితే పోలీస్ ఇన్స్పెక్టర్ ఎంట్రీ తో కథ మరింత ఆసక్తిగా సాగుతుంది. అసలు ఆ నకిలీ గుడి గుట్టు ఏమిటి ? గోవిందరాజ్ ఎలా చనిపోయాడు ? ఆ శవాన్ని శశి ఫ్యామిలీ మాయం చేసిందా ? ఈ గండం నుంచి వీళ్ళు ఎలా బయట పడ్డారు ? అనే విషయాలను మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ హ్యూమన్… ఊహించని ట్విస్టులతో సాగే అల్టిమేట్ సైన్స్ ఫిక్షన్ మూవీ

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×