Viral Video: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని హెలికాప్టర్ షాట్ మ్యాజిక్ గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకు మాత్రమే సాధ్యమైన ఈ షాట్ కి ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. ఈ షాట్ ని క్రికెట్ కి పరిచయం చేసింది ధోనియేనని వేరే చెప్పనక్కర్లేదు. మహేంద్ర సింగ్ ధోని తన బ్యాట్ ను అచ్చం హెలికాప్టర్ లాగే తిప్పుతూ బాల్ ని బౌండరీ దాటించి మొదట్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.
Also Read: Shubham Gill: ఇంగ్లాండ్ పై కసి.. 5 గంటలకే నిద్ర లేచి.. ఐస్ వాటర్ లో స్నానం.. గిల్ డైట్ ఇదే…
మెరుపు వేగంతో దూసుకు వచ్చే యార్కర్ బంతులను అంతే వేగంతో తిరిగి బాధడమే ఈ షాట్ ప్రత్యేకత. ఇక ఆ హెలికాప్టర్ షాట్ కి కచ్చితంగా బంతి స్టాంట్స్ లోకి వెళ్లాల్సిందే. మహేంద్ర సింగ్ ధోనీ ప్రవేశపెట్టిన ఈ షాట్ ని ఎందరో క్రికెటర్లు ఆడేందుకు ప్రయత్నించారు. ఇందులో కొంతమంది సఫలం అయితే.. మరి కొంతమందికి మాత్రం పరాభవం తప్పలేదు. ఇంటర్నేషనల్, దేశవాళీ, గల్లీ క్రికెట్ లోను ఈ షాట్ ని అనుకరించేందుకు చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు.
అయితే తాజాగా ఓ బుడ్డోడు అచ్చం ధోనీ లాగా ఈ హెలికాప్టర్ షాట్ ని అలావోకగా బాదుతూ ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే ఈ హెలికాప్టర్ షాట్ ని ధోని రైట్ హ్యాండ్ బ్యాటర్ గా బాదితే.. ఈ బుడ్డోడు మాత్రం లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా హెలికాప్టర్ షాట్ ని అలవోకగా బాదేశాడు. కాళ్ళకు పాడ్స్ కట్టుకొని ప్రొఫెషనల్ క్రికెటర్ వేషాధారణలో ఇంటి ముందు ఉన్న చిన్న ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడాడు ఈ బుడ్డోడు. హెలికాప్టర్ షాట్ ఆడిన అనంతరం బుడ్డోడు ఇచ్చిన స్మైల్ మాత్రం వేరే లెవెల్. పాదాల వద్ద యార్కర్ రూపంలో పడిన ఓ బంతిని కళ్ళు చెదిరే రీతిలో హెలికాప్టర్ షాట్ ఆడాడు.
అచ్చం మహేంద్ర సింగ్ ధోని లాగా హెలికాప్టర్ షాట్ కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. దీంతో ఆ బుడ్డోడి బ్యాటింగ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఈ వీడియోకి ఇప్పటికే లక్షల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. అంతేకాదు ఆ బుడ్డోడు ఆడిన షాట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో మహేంద్రసింగ్ ధోనీ తరహాలో హెలికాప్టర్ షాట్ ఆడాలని చాలామంది క్రికెటర్లు ప్రయత్నించారు.
ఇందులో హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్, మాక్స్వెల్, రషీద్ ఖాన్ ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్ ప్రతి మ్యాచ్ లోను కనీసం ఒక్క హెలికాప్టర్ షాట్ అయినా ఆడేందుకు ప్రయత్నిస్తుంటాడు. అలా సక్సెస్ కూడా అవుతూ ఉంటాడు. అయితే అవగాహన లేకుండా ఈ హెలికాప్టర్ షాట్ ఆడితే బ్యాట్స్మెన్ అవుట్ కావడమే కాకుండా గాయాలు అయ్యే ప్రమాదాలు చాలా ఎక్కువ. అందుకే చాలామంది క్రికెటర్లు ఈ హెలికాప్టర్ షాట్ ఆడే సాహసం చేయలేదు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">