Salman Butt : ఇంగ్లాండ్ గడ్డపై ( England) పాకిస్తాన్ తొలి టెస్ట్ లో అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పై అద్భుతమైన విక్టరీ సాధించిన తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై ఉతికి ఆరేస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించింది పాకిస్తాన్. కానీ ఆదిలోనే బాబర్ ఆజం గాయం బారిన పడడం… ఆ జట్టును కుదిపేసింది. బాబర్ లేడు అన్న ఒత్తిడి కారణంగా… తొలి మ్యాచ్ దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో ఓడిపోయిన క్రమంలో సోషల్ మీడియాలో ఆ జట్టును ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు. అసలు టెస్ట్ క్రికెట్ కు పాకిస్తాన్ జట్టు పనికిరాదు అన్నట్లుగా పోస్టులు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఇంగ్లాండ్ గడ్డపై తొలి మ్యాచ్ లో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి మాజీ క్రికెటర్లతో పాటు ఇండియన్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్న నేపథ్యంలో మాజీ ఆటగాడు సల్మాన్ బట్ (Salman Butt) స్పందించారు. పాకిస్తాన్ ను అనే ముందు.. టీమిండియా ఓటమి గురించి కూడా గుర్తు చేసుకోవాలని హితువు పలుకుతున్నారు. పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ ఓడిపోతే… ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా ( Team India) టి20 తో పాటు వన్డే సిరీస్ కోల్పోయిందని విమర్శలు చేశారు. మీరు ఇంగ్లాండ్ గడ్డపై సరిగ్గా ఆడి గెలిచి, పాకిస్తాన్ జట్టును విమర్శించాలి…కానీ మీరే ఓడిపోయి…? పాకిస్తాన్ పైన బురద జల్లడం దారుణం అన్నారు.
ప్రస్తుత పరిస్థితులలో టీమిండియా కంటే పాకిస్తాన్ కాస్త వీక్ అని తనకు తెలుసు అన్నారు. ఇలాంటి క్రమంలో ఇండియానే గట్టి పోటీ ఇవ్వక లేకపోతే.. పాకిస్తాన్ ఎలా ఆడుతుందని ప్రశ్నించారు. ప్రత్యర్థిని విమర్శించేముందు ముందుగా మీరు ఏం సాధించారో చూపించాల్సిన అవసరం ఉంటుందని హితువు పలికారు. పొద్దున లేస్తే పాకిస్తాన్ పైన బురద జల్లడం మానుకొని… టీమిండియాలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని అటు మాజీ క్రికెటర్లకు చురకలు అంటించారు.
పాకిస్తాన్ గడ్డపై ( Pakistan ) తమ జట్టును కొట్టడం ఎవరి తరం కాదని కీలక వ్యాఖ్యలు చేశారు సల్మాన్ బట్ ( Salman Butt). మొన్నటి వరకు శ్రీలంక, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లను తమ పాకిస్తాన్ గడ్డపై ఓడించామని గుర్తు చేశారు. ట్రై సిరీస్ జరిగిన కూడా ఆ పాకిస్తాన్ అద్భుతంగా రాణించిందని వివరించారు. అయితే విదేశీ గడ్డలపై మాత్రం పాకిస్తాన్ విఫలమవుతుందని.. దానిపైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లను మరింత టెక్నిక్ గా వాడుకోవాలని కోరారు.