Shoaib Akhtar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో గుజరాత్ ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మ ( Ashok Sharma ) ఇరగదీస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగిన అశోక్ శర్మ 150 కి పైగా వేగంతో బంతులు సంధిస్తున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అశోక్ శర్మ ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే ఈ 23 సంవత్సరాల గుజరాత్ టైటాన్స్ బౌలర్ అశోక్ శర్మ బౌలింగ్ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతనికి డ్రగ్స్ టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. అంత వేగంగా బంతులు వేయడం కష్టమైనా అని.. అలాంటి ప్లేయర్లకు కచ్చితంగా నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు షోయబ్ అక్తర్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు అశోక్ శర్మ భయంకరమైన స్పీడ్ తో బంతులు వేస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలో పుట్టి పెరిగిన ఈ ఆటగాడు, మొన్నటి వేలంలో 90 లక్షలు ధర పలికాడు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ టైటాన్స్ ఇతన్ని సొంతం చేసుకుంది. గత రెండు సంవత్సరాలుగా ఐపీఎల్ లో కొనసాగుతున్నప్పటికీ, అశోక్ శర్మకు అవకాశం రాలేదు. కానీ గుజరాత్ టైటాన్స్ లోకి వచ్చిన తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు అశోక్ శర్మ. ఈ క్రమంలోనే తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గంటకు 154.2 కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతున్నాడు.
అయితే, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు అశోక్ శర్మ బౌలింగ్ పై తాజాగా షోయబ్ అక్తర్ స్పందించారు. అశోక్ శర్మకు డ్రగ్స్ టెస్టులు చేయండి అంటూ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ క్రికెట్ లో చాలామంది బౌలర్లు ఉన్నారు.. కానీ అశోక్ శర్మ మాత్రం అద్భుతంగా బంతులు విసురుతున్నాడని షోయబ్ అక్తర్ మెచ్చుకున్నాడు. అతని బౌలింగ్ చూసి తాను షాక్ అవుతున్నట్లు వివరించారు. అశోక్ శర్మ లో అపారమైన ప్రతిభ ఉన్నట్లు తను గుర్తించానని స్పష్టం చేశారు. అతను కనుక కాస్త కష్టపడితే.. టీమిండియాలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తాడు అంటూ వ్యాఖ్యానించాడు. ఒకవేళ అంతర్జాతీయ క్రికెట్ లోకి అశోక్ శర్మ వస్తే తన రికార్డులు బద్దలు కొట్టే ప్రమాదం ఉందని వెల్లడించారు షోయబ్ అక్తర్. అయితే, అతడు ఆడే ప్రతి మ్యాచ్ కంటే ముందు డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలని సరికొత్త కిటుకు పెట్టాడు. ప్రతి బంతి 150 కి పైగా స్పీడ్ వేయడం కష్టమేనని.. అంత వేగంగా బంతులు వేసే బౌలర్లను కచ్చితంగా టెస్టులు చేయాలని కోరారు.
🚨 MASSIVE STATEMENT BY SHOAIB AKHTAR ON ASHOK SHARMA 🚨
Shoaib Akhtar Said 🗣️,
"Honestly, India’s Ashok Sharma is a fantastic bowler. I’m really impressed by his bowling. He has a lot of potential. If he works hard properly and manages his workload well, he has the ability to… pic.twitter.com/7CpfEQzEOS
— lndian Sports Netwrk (@IS_Netwrk29) April 5, 2026