Gambia vs Zim : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించడం కష్టం అనే చెప్పాలి. ఏ బ్యాటర్ ఎప్పుడూ ఫామ్ లోకి వస్తాడో.. ఎప్పుడు ఔట్ అవుతాడో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటీవల సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 300 పరుగులు సాధిస్తుందని అంతా భావించారు. కానీ 275 పరుగులకే పరిమితమైంది. SRH 300 పరుగులు చేస్తుందనుకున్న సమయంలో క్లాసెన్ లాంటి ఆటగాళ్లు ఔట్ కావడంతో చేయలేకపోయింది. కానీ ఇటీవలే గాంబియా వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగిన ఓ మ్యాచ్ లో జింబాబ్వే జట్టు భారీ స్కోర్ చేసింది. ఆ మ్యాచ్ లో జింబాబ్వే జట్టు 2.1 ఓవర్లకు 25 పరుగులు చేసింది. కానీ 20 ఓవర్లకు మాత్రం 344/4 చేయడం గమనార్హం.
Also Read : Aryaveer Kohli : కోహ్లీ ఫ్యామిలీ నుంచి మరో క్రికెటర్… ఇక రచ్చ రచ్చే
4 ఓవర్లు వేసి 93 పరుగులు
అసలు ఇప్పటివరకు జరిగిన టీ-20లలో ఇది రికార్డు అనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో జింబాబ్వే జట్టు 344 పరుగులు చేయడం చూసి అందరూ ఆశ్యర్యపోయారు. ఈ స్కోర్ చూసి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయడం విశేషం. బ్రియాన్ బెన్నిట్ 50 పరుగులు, మారుమణి 62, డియాన్ మైరీస్ 12, రాజా 133 పరుగులు చేశారు. బర్ల్ 25, క్లైవ్ మాడండే 53 పరుగులు చేశారు. దీంతో జింబాబ్వే జట్టు 344 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో ఒక బౌలర్ మూసా జోబార్తె 4 ఓవర్లు వేసి 93 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. అయితే ఈ మ్యాచ్ 2024లో జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
అంతర్జాతీయ టీ-20ల్లో భారీ విజయం
దీంతో టీ-20 క్రికెట్ లో జింబాబ్వే జట్టు ప్రపంచ రికార్డును సృష్టించింది. టీ-20 ప్రపంచ కప్ సబ్ రీజనల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియా పై భారీ స్కోర్ చేసి చరిత్ర సృష్టించింది. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా 43 బంతుల్లో 133 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే తరపున అంతర్జాతీయ టీ-20ల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు టీ-20ల్లో అత్యధిక స్కోర్ చేసిన నేపాల్ 314 రికార్డును జింబాబ్వే బ్రేకు చేసింది. 2023 ఆసియా క్రీడల్లో మంగోలియా పై నేపాల్ ఈ ఫీట్ సాధించింది. గాంబియా పై సికిందర్ రజాతో పాటు తడివానాశే మారుమణి 62, బెన్నెట్ 50, క్లైవ్ మండాడే 53 అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్ప కూలింది. ఆ జట్టులో 10 మంది సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం కావడం విశేషం. పదో స్థానంలో వచ్చిన ఆండ్రీ జార్జ్ 12 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 3, బ్రాండన్ మావుట 3, వెస్టీ మధ్వీర 2, ర్యాస్ బర్ల్ 1 వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో జింబాబ్వే జట్టు 290 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతర్జాతీయ టీ-20ల్లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.
?igsh=MW9zYXM4dmNqMWppaA==