Iyer vs Kohli : ఐపీఎల్ 2025 సీజన్ లో ఇప్పటికే పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆప్స్ కి చేరుకున్నాయి. అయితే వీటిలో టాప్ 2లో ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు రేపు క్వాలిఫైయర్ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఎల్లుండి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. అందులో విజయం సాధించిన జట్టు క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన జట్టుతో తలపడనుంది. ఇందులో విజయం సాధించిన జట్టు ఫైనల్ కి చేరుకుంటుంది. ఫైనల్ లో హోరా హోరీ పోరు కొనసాగుతుంది.
Also Read : Rishabh Pant : రిషబ్ పంత్‌కు భారీ జరిమానా విధించిన BCCI
క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్ వర్సెస్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఓవైపు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. మరోవైపు విరాట్ కోహ్లీ మధ్య రచ్చ జరిగే అవకాశం ఉంది. మొన్న లీగ్ దశలో ఈ ఇద్దరి మధ్య కాస్త గొడవ లాగా అయింది. అయితే ఈ మ్యాచ్ కోహ్లీ గెలిపించాడు. ఇప్పుడు అయ్యర్ రివేంజ్ తీర్చుకుంటాడా అని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇటీవలే లీగ్ దశలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విజృంభించాడు. రేపు జరుగబోయే క్వాలిఫైయర్ మ్యాచ్ లో పంజాబ్ జట్టు ఆర్సీబీ పై రివేంజ్ తీసుకుంటుందని అభిమానులు పేర్కొంటున్నారు.
Also Read : IND vs ENG Test Series : ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇదే.. ఉచితంగా ఎలా చూడాలి
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే కూడా శ్రేయాస్ అయ్యర్ కి విజయావకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రేయస్ కెప్టెన్సీ సమయంలో ఢిల్లీ జట్టును ఫైనల్ కి చేర్చాడు. గత ఏడాది కోల్ కతా నైట్ రైడర్స్ కి కెప్టెన్ గా ఉన్న శ్రేయాస్ అయ్యర్ టైటిల్ ని అందించాడు. ఈ సారి కూడా పంజాబ్ ని పైనల్ కి చేర్చి టైటిల్ అందించాలనే ధీమాతో ఉన్నాడు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించని పంజాబ్ జట్టు.. రాయల్ ఛాలెంజర్స్ జట్లు ఈ సీజన్ లో టైటిల్ సాధించాలని పలువురు క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఊహించని రీతిలో ఈ సీజన్ లో ఎలిమినేటర్ కి ఎంపికైన జట్లు కూడా టైటిల్య సాధించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. లీగ్ దశలో జరిగే మ్యాచ్ లకు ప్లే ఆప్స్ మ్యాచ్ లకు చాలా తేడా ఉంటుందని చెప్పవచ్చు. ప్లే ఆప్స్ లో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ మినహా.. మిగతా మ్యాచ్ లు అన్ని కూడా తప్పక గెలవాల్సి ఉంటుంది. గెలిచిన జట్టే ముందుకు వెళ్తుంది. గెలవని జట్టు ఇంటి బాట పట్టాల్సిందే. రేపు జరగబోయే క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంటుందో వేచి చూడాలి మరీ.