Umar Nazir: ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ఓ ఫాస్ట్ బౌలర్ గురించి అందరూ… చర్చించుకుంటున్నారు. తాజాగా జరిగిన రంజి ట్రోఫీ మ్యాచ్లో… అంతర్జాతీయ క్రికెటర్ల వికెట్లు తీసి పాపులర్ అయ్యాడు ఈ జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఉమర్ నజీర్. దీంతో అందరూ జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఉమర్ నజీర్ ( Umar Nazir ) గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ కు వెళ్లి ఇతను ఎవరబ్బా అని ? తెగ వెతికేస్తున్నారు. ముంబై తో తాజాగా జరిగిన రంజీ మ్యాచ్ లో జమ్మూ కాశ్మీర్ ( Jammu Kashmir ) తరఫున ఆడిన ఉమర్ నజీర్ ( Umar Nazir )… సీనియర్ ఆటగాళ్లందరికీ చుక్కలు చూపించడం జరిగింది.
Also Read: Marco Jansen: వీడు ఎవడ్రా బాబు.. రెండు కుర్చీలు వేసుకోనిదే అందడం లేదు !
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ను ( Rohit Sharma ) మూడు పరుగులకే అవుట్ చేశాడు ఈ డేంజర్ ఆటగాడు. ఆ తర్వాత అజింక్య రహానేను ( Ajinkya Rahane ) పెవిలియన్కు పంపించాడు. ఆ సమయంలో 12 పరుగులు చేసిన అజింక్య రహానే ( Ajinkya Rahane )… ఉమర్ నజీర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక సిక్స్ ల వీరుడు శివం దుబే మూడు పరుగులకే అవుట్ కావడం జరిగింది. అలాగే హార్దిక్ తామూర్ కూడా ఏడు పరుగులకు… ఉమర్ నజీర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
దీంతో సోషల్ మీడియాలో… ఉమర్ నజీర్ గురించి అందరూ చర్చించు కుంటున్నారు. గతంలో జమ్మూ కాశ్మీర్ ( Jammu Kashmir ) కు సంబంధించిన ఉమ్రాన్ మాలిక్ తరహాలోనే… ఇప్పుడు ఉమర్ నజీర్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. అయితే 31 సంవత్సరాలు ఉన్న జమ్మూ కాశ్మీర్ ( Jammu Kashmir ) ఆటగాడు ఉమర్ నజీర్ ( Umar Nazir )… ను టెస్ట్ మ్యాచ్లోకి తీసుకురావాలని కొంత మంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఆటగాడు ఉంటే కచ్చితంగా టీమిండియా కు ప్లస్ అవుతుందని కోరుతున్నారు. మరి కొంతమంది అయితే… మహమ్మద్ సిరాజు లాంటి ప్లేయర్ల స్థానంలో ఇతన్ని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: England players – RCB: RCB దరిద్రం.. ఈ ముగ్గురు ప్లేయర్లు అట్టర్ ఫ్లాఫ్.. రూ. 20 కోట్లు బొక్కా?
దేశవాళీ క్రికెట్‌లో జమ్మూ కాశ్మీర్‌కు అనుభవజ్ఞుడైన ప్లేయర్ ఉమర్ నజీర్. ఇతను ఏకం గా 6 అడుగులు ఉంటాడు. 2013లో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో అరంగేట్రం చేసాడు ఉమర్ నజీర్ ( Umar Nazir ). అప్పటి నుంచి 57 మ్యాచ్‌లలో 138 వికెట్లు తీశాడు ఉమర్ నజీర్ ( Umar Nazir ). లిస్ట్ ఎ క్రికెట్‌లో, అతను 54 వికెట్లను కలిగి ఉండగా, ఫాస్ట్ బౌలర్ T20లలో 32 వికెట్లు తీసుకున్నాడు ఉమర్ నజీర్ ( Umar Nazir ). పుల్వామాకు చెందిన 6-అడుగుల-4 ఎత్తులో ఉన్న ఉమర్ నజీర్ ( Umar Nazir ), 2018–19 దేవధర్ ట్రోఫీ కోసం ఇండియా సి జట్టులో కూడా ఎంపికయ్యాడు. ఇవాళ అంటే గురువారం జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన ముంబై రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మను అవుట్ చేయడం తో ఉమర్ నజీర్ తెరపై వచ్చింది.