Iran Nuclear Spy| ఇరాన్ దేశంలో యురేనియం నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని వాటితో ఇరాన్ త్వరలోనే అణుబాంబులు తయారు చేస్తోందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్, అమెరికాలు ఇంత కాలం ప్రపంచాన్ని నమ్మించాయి. ఇరాన్ అణుబాంబులు తయారు చేసుకుంటే వాటితో ఇజ్రాయెల్ పై దాడి చేస్తుందని.. అందుకే తమ దేశ రక్షణ కోసం ఇరాన్ పై దాడులు చేసిందని ఇజ్రాయెల్. అమెరికా కూడా ఇజ్రాయెల్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. ఇదే కథ 20 ఏళ్ల క్రితం జరిగింది. అయితే అప్పుడు ఇరాన్ పొరుగు దేశం ఇరాక్ టార్గెట్. అప్పుడు కూడా పాలస్తీనా ప్రజలను వేధిస్తూ ఉన్న ఇజ్రాయెల్ ను తీవ్రంగా వ్యతిరేకించాడు ఇరాన్ పాలకుడు సద్దాం హుస్సేన్. దీంతో ఇరాన్ లో అణుబాంబులు ఉన్నాయని ప్రపంచానికి బూచీ చూపించి ఇరాక్ లో అమెరికా సైన్యం మారణ హోమం సృష్టించింది. చివరికి సద్దాం హుస్సేన్ ను ఉరి తీసింది.
కానీ ఆ తరువాత ఇప్పటి వరకు ఇరాక్ లో ఎలాంటి అణుబాంబులు లేవని తేలింది.సరిగ్గా 21 ఏళ్ల తరువాత ఇప్పుడు ఇరాన్ కథ కూడా అలాగే సాగుతోంది. ఎందుకంటే ఇజ్రాయెల్.. ఇప్పటివరకు ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తోందని ఆరోపిస్తూ వస్తే.. స్వయంగా అమెరికా గూఢాచార విభాగమే అలాంటిదేమీ లేదని రిపోర్ట్ సమర్పించింది. అయినా ఇజ్రాయెల్ ఆగడం లేదు.
ఈ సంవత్సరం మొదట్లో.. అమెరికా జాతీయ గూఢచారి డైరెక్టర్ తులసి గబ్బర్డ్.. అమెరికా కాంగ్రెస్‌లో ఇరాన్ అణు కార్యక్రమంపై రిపోర్ట్ సమర్పించారు. ఇరాన్ అణు ఆయుధాన్ని తయారు చేయడం లేదని, దాని సుప్రీం లీడర్ 2003లో నిలిపివేసిన అణు ఆయుధ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించలేదని ఆమె చెప్పారు. అయితే, ఇరాన్ యురేనియం సంవృద్ధిని అధిక స్థాయిలో చేస్తోందని కూడా ఆమె తెలిపారు.
కానీ ఈ మధ్య జరిగిన గ్రూప్ ఆఫ్ సెవెన్ దేశాల సమావేశం నుంచి తిరిగి వస్తున్నప్పుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ గూఢచార సంస్థల అంచనాలను తోసిపుచ్చారు. ఇరాన్ అణు బాంబును తయారు చేయడానికి చాలా దగ్గరగా ఉందని ఆయన అన్నారు. ఇది ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అభిప్రాయంతో ఆయన ఏకీభవిస్తూ వ్యాఖ్యానించినట్లు ఉంది. ఆయన ఇరాన్‌ను అణు ఆయుధ ప్రమాద దేశంగా చూస్తున్నారు. ట్రంప్ మంగళవారం జాతీయ భద్రతా అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో గబ్బర్డ్ కూడా ఉన్నారు.
ట్రంప్, గబ్బర్డ్ ఇద్దరూ పరస్పర వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం పెద్ద సమస్య కాదని అధికారులు చెప్పారు. ఇరాన్ యురేనియం సంవృద్ధి అణు ఆయుధానికి.. దారితీస్తుందని వారు అన్నారు. గబ్బర్డ్ మాట్లాడుతూ.. తాను, ట్రంప్ ఒకే విషయం చెబుతున్నామని, మీడియా తమ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుందని అన్నారు. “మేము ఒకే దారిలో ఉన్నాము,” అని ఆమె సిఎన్ఎన్ మీడియాతో చెప్పారు.
మార్చి 2025లో తులసి గబ్బర్డ్.. అమెరికన్ కాంగ్రెస్‌లో చెప్పిన దాని ప్రకారం.. గూఢచార సంస్థలు ఇరాన్ అణు ఆయుధాన్ని తయారు చేయడం లేదని, సుప్రీం లీడర్ ఖమేనీ 2003లో నిలిపివేసిన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించలేదని అంచనా వేశాయి. అయితే, ఇరాన్ యురేనియం నిల్వలు గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉన్నాయని ఆమె చెప్పారు.
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అమెరికా సైన్యానికి నాయకత్వం వహిస్తున్న జనరల్ ఎరిక్ కురిల్లా, ఇరాన్ మూడు వారాల్లో 10 అణు ఆయుధాలకు సరిపడా పదార్థాన్ని ఉత్పత్తి చేయగలదని చెప్పారు. కానీ, ఆ పదార్థాన్ని బాంబుగా మార్చడానికి ఎంత సమయం పడుతుందో ఆయన చెప్పలేదు. ఒక గూఢచార అధికారి మాట్లాడుతూ.. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలు.. ఆ దేశ అవసరాలకు మించి ఉన్నాయని, ఈ విషయంలో ట్రంప్ ఆందోళన సరైనదని అన్నారు. మరో అధికారి, ఇరాన్ అణు ఆయుధానికి చాలా దగ్గరగా ఉందని చెప్పారు.
ట్రంప్ గతంలో కూడా గూఢచార నాయకులతో విభేదించారు. 2016 అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని అడిగినప్పుడు.. ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. అయితే ఇరాన్ విషయంలో ఆయన గబ్బర్డ్‌తో విభేదించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ట్రంప్ తన రెండో పరిపాలనలో తనకు అత్యంత విశ్వసనీయంగా ఉండేవారినే కీలక పదవుల్లో నియమించుకున్నారు. వారిలో గబ్బర్డ్ కూడా ఒకరు. గబ్బర్డ్.. హవాయికి చెందిన మాజీ డెమోక్రట్ కాంగ్రెస్ సభ్యురాలు, 2022లో డెమోక్రటిక్ పార్టీని వీడి, ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు.
Also Read: అమెరికా ఆ పని చేస్తేనే యుద్ధం ముగింపు.. కాల్పుల విరమణకు కండీషన్ పెట్టిన ఇరాన్
ఇరాన్ అణు కార్యక్రమం శాంతియుతమని ఇరాన్ చెబుతోంది, కానీ అంతర్జాతీయ అణు శక్తి సంస్థ అధిపతి, ఇరాన్ వద్ద అనేక అణు బాంబులు తయారు చేయగల యురేనియం ఉందని హెచ్చరించారు. గతంలో బైడెన్ పరిపాలనలో వచ్చిన నివేదిక కూడా ఇరాన్ అణు ఆయుధాన్ని తయారు చేయడం లేదని, కానీ తయారు చేయగల సామర్థ్యం ఇరాన్‌కు ఉందని చెప్పింది.