Podarillu Kanna : తెలుగు ప్రేక్షకులను ఆకస్ కుంటూ వస్తున్న సీరియల్స్లలో స్టార్ మా చానల్ సీరియలు ఎప్పుడు ముందు వరుసలో ఉంటాయన్న విషయం తెలిసిందే.. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న ‘పొదిరిల్లు’ సీరియల్ కూడా ఒకటి. సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన ఈ సీరియల్ రోజురోజుకీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటూ వస్తుంది. దాదాపు ఏడాది కావస్తున్నా ఈ సీరియల్ ప్రేక్షకులను రోజురోజుకీ మరింత కనెక్ట్ అయ్యేలా చేస్తూ అలరిస్తూ వస్తుంది. నటించిన ప్రతి క్యారెక్టర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కన్నా క్యారెక్టర్ జనాలకి కన్నీళ్లు తెప్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు తన తల్లి రావడంతో తను చాలా సంతోషంగా ఉంటాడు. అయితే ఇంక కొద్ది రోజుల్లో ఈ సీరియల్ నుంచి తప్పుకోబోతున్నాడు అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
పొదిరిల్లు సీరియల్ లో కన్నా క్యారెక్టర్ అందరిని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. అందరికన్నా చిన్నవాడు కావడంతో అతని చాలా ముద్దుగా ఎవరు బాధ పెట్టకుండా చూసుకుంటూ ఉంటారు.. ప్రతి చిన్న విషయానికి తను ఎమోషనల్ అయిపోతున్నాడని ఆ ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒక చంటి బిడ్డ లాగా కన్నా ని చూసుకుంటూ ఉంటారు. అయితే కన్నా తన తల్లి రావడంతో చాలా సంతోషంగా ఉంటాడు. కానీ తన తల్లి ఒక మోసగత్తె అని మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. దాంతో కన్నా కూడా తన తల్లి మోసాన్ని భరించలేక ఇంట్లోని వాళ్లందరికీ దూరం అయిపోతాడు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ సీరియల్ మంచి రేటింగు క్యూరియాసిటీతో జనాలని ఆకట్టుకుంటూ వస్తుంది.
ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ రోజురోజుకి ట్విస్టులతో ఆకట్టుకుంటూ వస్తుంది.. కన్న వాళ్ళ అమ్మ గురించి అటు నారాయణ కానీ,ఇటు జమున కానీ అస్సలు చెప్పకుండా వాళ్లలో వాళ్లే గొడవ పడుతూ కనిపిస్తూ ఉంటారు. అసలు ఎందుకు వీళ్లిద్దరు గొడవ పడుతున్నారు అని మహాలక్ష్మి చక్రి కనుక్కునే ప్రయత్నాలు కూడా చేస్తారు. జమున మాత్రం తన కొత్త భర్త కష్టాల్లో ఉన్నాడు అని ఎలాగైనా సరే అప్పులు తీర్చాలి అని ఈ ఇంట్లో అడుగుపెడుతుంది.. మాధవ్ తన కన్నతల్లి గాజులు ఇస్తూ ఉండగా నారాయణ అడ్డుపడి ఆ గాజులు ఇవ్వడానికి వీల్లేదు అని అంటాడు. ఇక మహాలక్ష్మికి జమున దొరికిపోతుంది కానీ ఏదో దాస్తుంది అన్న అనుమానం కూడా పెరిగిపోతుంది.. ఇక అంతే కాదు కేశవ షాప్ కోసం అందరూ సాయం చేయడం జమున చూసి ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది. నేను మంచి టైం లోనే ఇంట్లో అడుగు పెట్టాను ఈ డబ్బులను కొట్టేస్తే అప్పులు మొత్తం తీరిపోతాయి అని అనుకుంటుంది. అది చూసిన మహాలక్ష్మి ఈమె ఏదో తేడాగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో జమున బాగోతం బయట పడుతుందా లేదా అన్నది చూడాలి..