Sanju Samson: ప్రస్తుతం మన దేశంలో చాలా రాష్ట్రాలలో పొట్టి ఫార్మాట్ లో స్థానికంగా లీగ్స్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే నిర్వహిస్తున్న కేరళ క్రికెట్ లీగ్ {KCL} కి సంబంధించిన ఆక్షన్ తాజాగా జరిగింది. ఈ ఆక్షన్ లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ కేరళ క్రికెట్ లీగ్ {KCL} లో చరిత్ర సృష్టించాడు. కేరళ క్రికెట్ లీగ్ సీజన్ 2 కోసం నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో రికార్డు స్థాయి ధరను దక్కించుకున్నాడు.
Also Read: Jasprit Bumrah: బుమ్రా వెంట పడుతున్న లేడీ… హాట్ చూపులతో పడేసేలా ఉందే!
సగం బిడ్డింగ్ మొత్తాన్ని కేవలం సంజూ శాంసన్ కోసమే వెచ్చించింది ఓ ఫ్రాంచైజీ. అతడిని 26.8 లక్షల ధర చెల్లించి సొంతం చేసుకుంది. కోట్ల ధర పలికే ఈ ఆటగాడికి ఇంత తక్కువ అమౌంట్ దక్కితే రికార్డు ఏంటని సందేహపడకండి. ఈ కేరళ క్రికెట్ లీగ్ వేలంలో ప్రతి జట్టు 50 లక్షల వరకు ఖర్చు చేయాలని నిర్ణయించారు. కానీ కొచ్చి బ్లూ టైగర్స్ తమ పర్స్ లోని సగం కంటే ఎక్కువ మొత్తాన్ని కేవలం ఇతడి కోసమే ఖర్చు చేస్తుంది. దీంతో ఈ లీగ్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా సంజూ చరిత్ర సృష్టించాడు.
కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు సంజూ ని 26.8 లక్షల ధరకు సొంతం చేసుకుంది. గతంలో ఎం.ఎస్ అఖిల్ {రూ. 7.4 లక్షలు త్రివేండ్రం రాయల్స్} పేరిట ఉన్న రికార్డును సంజూ చెరిపేశాడు. సంజూ టీమ్ ఇండియా టెస్ట్, వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యుడు కాదు. కానీ టి-20 ల్లో మాత్రం రెగ్యులర్ ఆటగాడు. ప్రస్తుతం భారత జట్టుకు ఎటువంటి టీ-20 లు లేకపోవడంతో కేరళ క్రికెట్ లీగ్ టోర్నీ మొత్తానికి సంజు అందుబాటులో ఉంటాడు.
ఈ కేరళ క్రికెట్ లీగ్ సీజన్ 2 ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 6 వరకు జరగబోతోంది. ఇక ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ సంజూ కి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది. దీంతో సంజు రాజస్థాన్ ని వదిలి అందుబాటులోకి వస్తాడేమోనని రెండు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని సమాచారం. ఈ వికెట్ కీపర్ కం బ్యాటర్ తమ జట్టులోకి వస్తే ఎదురు ఉండదని ఈ రెండు ఫ్రాంచైజీలు భావిస్తున్నాయట.
Also Read: Prasidh krishna: కప్పను మింగిన పాములాగా తయారైన ప్రసిద్… టీమిండియాను ఓడించేందుకు కుట్రలు..?
అందులో ఒకటి కలకత్తా నైట్ రైడర్స్ కాగా.. మరొకటి చెన్నయ్ సూపర్ కింగ్స్ అని తెలుస్తోంది. కలకత్తా కంటే చెన్నై సంజూ రాక కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. వచ్చే ఐపీఎల్ తో మహేంద్ర సింగ్ ధోని 45వ ఏట అడుగు పెడతాడు. అందువల్ల కీపర్ కం బ్యాటర్ అయిన ధోనికి ప్రత్యామ్నాయంగా సంజూ ని తీసుకోవాలని చెన్నై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అతడు అందుబాటులోకి వస్తే ఎంత ధరకైనా సరే అతడిని దక్కించుకోవాలని ఫిక్స్ అయిందట చెన్నై.