Mohammed Siraj : టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఐపీఎల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాద్ కుర్రాడు టీమిండియాలో చోటు సంపాదించి అద్భుతమైన బౌలర్లలో ఒకడిగా రాణిస్తున్నాడు. ఈ భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. తాజాగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో జోహార్సా పేరిట సరికొత్త లగ్జరీ రెస్టారెంట్ ను సిరాజ్ ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని సిరాజ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. కస్టమర్ల కోసం పర్షియన్, ఆరేబియన్, మొఘలాయ్, చైనీల్ లాంటి రకరకాల వంటకాలు తమ రెస్టారెంట్ లో అందించనున్నట్టు తెలిపాడు.
Also Read : Indian Cricketers: టీమిండియా ప్లేయర్ అరాచకం.. ఒక్క దేశానికి ఒక్క అమ్మాయిని..!
ఈ ఫుడ్ బిజినెస్ లో అతని సోదరుడు కూడా భాగస్వామిగా ఉన్నట్టు ఇటీవలే సిరాజ్ మీడియాకి వెల్లడించాడు. వాస్తవానికి భారత క్రికెటర్లు ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఇదేమి మొదటిసారి కాదు. ఇప్పటికే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. బెంగళూరు, ముంబై, పుణే, కోల్ కతా, ఢిల్లీ, హైదరాబాద్ లో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లున్నాయి. విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ వంటి క్రికెట్ దిగ్గజాలు సైతం ఫుడ్ బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. సిరాజ్ ప్రారంభించిన రెస్టారెంట్ ప్రారంభంలో బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం గిరాకీ సరిగ్గా లేదట. వాస్తవానికి క్రికెటర్లు పెట్టిన రెస్టారెంట్లు పేద వారికి అందుబాటు ధరలో ఉండవు.
ఎక్కువ ధర పెట్టి మధ్య తరగతి ప్రజలు రెస్టారెంట్ కి ఒకటి, రెండు సార్లకు మించి వెళ్లరు. ధనికులు మాత్రమే వెళ్తారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గిరాకీ లేక సిరాజ్ రెస్టారెంట్ ని మూసీ వేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సిరాజ్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి సన్నద్ధం అవుతున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్ జరిగిన తొలి టెస్టులో ఆడాడు సిరాజ్. జులై 02వ తేదీ నుంచి రెండో టెస్టు నుంచి ఆడనున్నాడు. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. తొలి టెస్ట్ మ్యాచ్ జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. రెండో టెస్టు మ్యాచ్ లో బుమ్రా ఆడటం డౌటే అని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్ జట్టులోకి కీలక బౌలర్ ఆర్చర్ రానున్నారు. బుమ్రా కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడుతాడని ఇటీవల కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించిన విషయం తెలిసిందే.