MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై ( Mahendra Singh Dhoni )… మాజీ క్రికెటర్లు అందరూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే మహేంద్రసింగ్ ధోనీని టార్గెట్ చేసి టీమిండియా స్టార్ బౌలర్ మోహిత్ శర్మ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు కూల్ గా ఉండే మహేంద్ర సింగ్ ధోని నన్ను దారుణంగా తిట్టాడని.. అసభ్య పదజాలంతో దూషించాడని బాంబు పేల్చాడు మోహిత్ శర్మ. ఈ సంఘటన చాంపియన్స్ లీగ్ టోర్నమెంట్లో జరిగినట్లు మోహిత్ శర్మ తాజాగా ప్రకటించారు. ధోని తిట్టగానే తాను బాధపడ్డానని కూడా వెల్లడించాడు మోహిత్ శర్మ. దీంతో ధోనిపై మోహిత్ శర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: Mitchell Starc Retirement: ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ… డేంజర్ బౌలర్ మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్
ధోని నన్ను బండ బూతులు తిట్టాడు.. టీమిండియా బౌలర్ సంచలనం
ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలో ( Champions League trophy ) భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( Chennai Super Kings team ) తరఫున మోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తూ మోహిత్ శర్మ టీమిండియాలోకి కూడా వచ్చాడు. మోహిత్ శర్మ లో ఉన్న టాలెంట్ ను గుర్తించింది మహేంద్రసింగ్ ధోని. ఈ నేపథ్యంలోనే మోహిత్ శర్మ తన ప్రదర్శనను… చేసి టీమిండియాలోకి నేరుగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోనీ పైనే తాజాగా మోహిత్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో… కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో… ఈశ్వర్ పాండేను బౌలింగ్ చేయాలని ధోని పిలిచాడట. అయితే అది అర్థం కాక తననే ధోని పిలిచాడని మోహిత్ శర్మ బౌలింగ్ చేసేందుకు వెళ్లాడట. ఈ నేపథ్యంలోనే మహేంద్ర సింగ్ ధోని కోపం కట్టలు తెంచుకుందట. ఎప్పుడు లేని విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారట మహేంద్రసింగ్ ధోని. డ్రెస్సింగ్ రూమ్ లో కూడా అసభ్య పదజాలంతో తిట్టాడని.. మోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. కానీ ధోని నాయకత్వంలో పనిచేయడం తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. అతని వల్ల తాను ఎంతో నేర్చుకున్నానని కూడా గుర్తు చేశాడు.
మోహిత్ శర్మ కెరియర్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ ( Mohit Sharma) హర్యానా రాష్ట్రానికి చెందిన వాడు. 36 సంవత్సరాల మోహిత్ శర్మ కుడిచేతి ఫాస్ట్ బౌలర్. 2013 సంవత్సరంలో టీమిండియా లోకి అరంగేట్రం చేశాడు. తన కెరీర్ లో ఇప్పటివరకు 26 వన్డేలు, 8 t20 అంతర్జాతీయ మ్యాచులు మాత్రమే ఆడాడు.