Viral video: గత కొన్ని రోజులుగా భారతదేశ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుండపోత వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో భారీ నష్టం కూడా చేకూరింది. కొన్ని చోట్ల ఇళ్లు కూడా కూలిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కుండపోత వానలు కురిశాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో వారం రోజుల పాటు వానలు దంచికొట్టాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే అక్కడ బస్తీ జిల్లాలో యువకులు కబడ్డీ ఆడుతుండా ఆకస్మికంగా భారీ పిడుగు పడింది. దీంతో యువకులు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి వివరాల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవి తీరాల్సిందే..
⦿ పిల్లలంతా కలిసి కబడ్డీ ఆడుతుంటే.. సడెన్‌గా?
యూపీలోని బస్తీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కిసాన్ డిగ్రీ కాలేజీలో కొంత మంది యువకులు, చిన్నారులు ఉత్సాహంగా కబడ్డీ ఆడుతున్నారు. అదే సమయంలో ఆకాశం మేఘావృతమై.. చీకటి మేఘాలతో అప్పుడే లైట్ గా వర్షం ప్రారంభమైంది. యువకులు నార్మల్ రెయినే కదా అని ఆటను కొనసాగించారు. ఇక అంతలోనే పక్కన ఉన్న చెట్లపై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ పిడుగు పడింది. అది కూడా ఆకస్మాత్తుగా పిడుగు పడడంతో పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఇక వెంటనే అక్కడను పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే క్షణాల్లోనే తెగ వైరల్ అవుతోంది.
⦿ వీడియో వేరే లెవల్..
పిడుగు పడిన వెంటేనే అక్కడనున్న యువత క్షణాల్లో పరుగులు తీశారు. భీకర శబ్దంతో పిడుగులు పడడంతో భయాందోళనకు లోనయ్యారు. భారీ పిడుగు నుంచి క్షణాల్లో తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పిల్లలంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ యువకుడు తన మొబైల్ ఫోన్ లో బంధించాడు. లక్షలాది మంది ఈ వీడియోను చూసి, షేర్ చేస్తున్నారు. వీడియోకు వేలల్లో కామెంట్లు వస్తున్నాయి..
#Watch | Panic struck at a kabaddi match in Uttar Pradesh’s Basti when lightning suddenly lit up the sky. Children and spectators ran in fear as thunder roared across the Kisan Degree College ground. Thankfully, the scare ended without injuries, leaving behind a moment of shock… pic.twitter.com/YXJDIgJHwA
— The Daily Jagran (@TheDailyJagran) September 1, 2025
⦿ మీకు భూమిపై ఇంకా నూకలున్నాయ్..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. ‘అరేయ్ కుర్రాళ్లు.. భూమి పై మీకు ఇంకా నూకలు ఉన్నాయ్.. అందుకే బతికిపోయారు’ అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ‘వర్షం పడినప్పుడు చెట్ల వద్ద ఉండొద్దని.. వీలైనంత వరకు సురక్షిత ప్రదేశంలో ఉండాలి’ అని కామెంట్ చేసుకొచ్చాడు. ‘ఇంకోసారి వర్షం పడే సమయంలో జన్మలో కూడా వాళ్లు ఏ ఆట ఆడరు.. ’ అని కొంత మంది నెటిజన్లు రాసుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇది కేవలం ఒక కబడ్డీ మ్యాచ్ కంటే ఎక్కువగా, ప్రకృతి ఆశ్చర్యకరమైన శక్తిని ప్రదర్శించే ఒక ఘటనగా చర్చనీయాంశంగా మారింది.