E-Paper
Advertisement

Mohsin Naqvi: నఖ్వీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. ప్రేక్ష‌కులు లేకుండానే PSL 2026 నిర్వ‌హ‌ణ‌

Mohsin Naqvi: నఖ్వీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. ప్రేక్ష‌కులు లేకుండానే PSL 2026 నిర్వ‌హ‌ణ‌
Advertisement

Mohsin Naqvi: పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ మరో ఆరు రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi  ) వివాదాస్పద ప్రకటన చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటును (PSL 2026)  ప్రేక్షకులు లేకుండానే ప్రారంభించబోతున్నట్లు అధికారిక స్టేట్మెంట్ ఇచ్చారు. ముందుగా ప్రేక్షకులతోనే ఈ టోర్నమెంట్ నిర్వహించాలని అనుకున్నాం, కానీ ప్రస్తుత పరిస్థితులలో ప్రేక్షకులు లేకుండానే టోర్నమెంట్ నిర్వహణ జరుగుతుందని తెలిపారు. ఇక ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు బిగ్ రిలీఫ్ ఇస్తూ మరో ప్రకటన చేశారు. మరో 72 గంటల్లో ఎవరైతే టికెట్లు కొనుగోలు చేసుకున్నారో వాళ్లకు, తిరిగి డబ్బులు చెల్లిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు.

Also Read: Irfan Pathan On CSK: 44 ఏళ్ల ధోని డ్రెస్సింగ్ రూంలో కూర్చుంటేనే బెటర్..స‌ర్ఫ‌రాజ్ లాంటి కుర్రాళ్ల‌కు ఛాన్స్ ఇవ్వాలి

ప్రేక్ష‌కులు లేకుండానే PSL 2026 నిర్వ‌హ‌ణ‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు పోటీగా వస్తున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటుకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది విదేశీ క్రికెటర్లు ఈ టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు. ఇక లేటెస్ట్ గా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ పైన ఇరాన్ వర్సెస్ అమెరికా యుద్ధం ఎఫెక్ట్ కూడా పడింది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటును ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని తాజాగా PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi  ) ప్రకటించారు. ముందుగా ప్రేక్షకులతోనే ఈ టోర్నమెంట్ నిర్వహించాలని అనుకున్నామని, కానీ చమురు కొరత, ఖర్చు తగ్గించుకునే క్రమంలో ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపారు. ఈసారి ప్రేక్షకులు లేకుండానే టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు.

అంతేకాదు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు ఎప్పటిలాగే మార్చి 26వ తేదీన ప్రారంభం కానుందని క్లారిటీ ఇచ్చారు. అయితే మొదట ఆరు వేదికలు అనుకున్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం నేపథ్యంలో కేవలం రెండు వేదికలకు ఈ టోర్నమెంట్ కుదించారు. పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ 2026 టోర్నమెంట్ ను లాహోర్ అలాగే కరాచీ లాంటి ఎక్కువ భద్రత ఉన్న నగరాలలోనే నిర్వహిస్తామని మొహ్సిన్ నఖ్వీ వెల్లడించారు. ఇక ఈ టోర్నమెంట్ ఓపెనింగ్ కార్య‌క్ర‌మాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తమ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని ప్రేక్షకులు కూడా టీవీల ద్వారా మాత్రమే టోర్నమెంట్ చూడాలని కోరారు. ఇక మొహ్సిన్ నఖ్వీ ప్రకటన చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు.

ప్రేక్షకులు లేకుండానే టోర్నమెంట్ ఎందుకంటే ?

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు 6 నగరాలలో నిర్వహించాలంటే కోట్లల్లో డబ్బులు కావాలి. ఈ మ్యాచ్ లో అన్నీ కూడా రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతాయి. అంటే ఫ్లడ్ లైట్స్ కచ్చితంగా అవసరం. ఈ ఫ్లడ్ లైట్స్ మైంటెన్ చేయాలంటే చమురు విపరీతంగా కావాలి. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ కు అంతంత మాత్రమే చమురు అలాగే ఎల్పీజీ వస్తోంది. ఈ క్రమంలో అదనంగా ఖర్చు చేస్తే బొక్క పడుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దగ్గర కూడా పెద్దగా నిధులు లేవు. ఈ క్రమంలోనే ప్రేక్షకులు లేకుండానే టోర్నమెంట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు.

Also Read: Kohli-Charter Flight: 3 రోజులకోసారి లండ‌న్ పోతా..చార్టెడ్ ఫ్లైట్ కొనివ్వండి, RCBని టార్చ‌ర్ చేస్తోన్న విరాట్ కోహ్లీ

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×