Morne Morkel On Hardik Vs Nitish Reddy: తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పై టీమిండియా బౌలింగ్ మోర్నే మోర్కెల్ ( Morne Morkel ) సంచలనం వ్యాఖ్యలు చేశారు. అతడిని పొగుడుతూ పరోక్షంగా హార్దిక్ పాండ్యాను అవమానించారు. టీమిండియాలో ప్రస్తుతం ది బెస్ట్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. హార్దిక్ పాండ్యా తరచూ గాయపడుతున్న నేపథ్యంలో… నితీష్ కుమార్ రెడ్డి సేవలు టీమిండియాకు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఇలాంటి వాడు టీం ఇండియాకు ఉండడం అదృష్టం అని తెలిపారు. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని పరిగణలోకి తీసుకోవాలని మోర్నే మోర్కెల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
టీమిండియాలో నితీష్ కుమార్ రెడ్డి ది బెస్ట్ ఆల్ రౌండర్ అని కొనియాడారు మోర్నే మోర్కెల్. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ అద్భుతంగా చేస్తున్నాడని వివరించారు. కలిస్ తరహాలోనే టీమ్ ఇండియాకు నితీష్ కుమార్ రెడ్డి అన్నట్లుగా వ్యవహారం మారిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా జట్టులో లేడు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డికి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని వివరించారు. వచ్చిన అవకాశాలను కూడా నితీష్ కుమార్ రెడ్డి సద్వినియోగం చేసుకోవడం ప్రశంసనీయమని తెలిపారు. ఇలాంటి వాడు టీం ఇండియాకు చాలా అవసరం అని పేర్కొన్నారు. నితీష్ కుమార్ రెడ్డి కచ్చితంగా వన్డేల్లో 10 ఓవర్లు వేసి తీరుతాడని ప్రశంసించారు. కానీ హార్దిక్ పాండ్యా ఇబ్బంది పడుతున్నాడని గుర్తు చేశారు. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఆడడం కష్టమేనని అంచనా వేస్తున్నారు. దీనికి ప్రత్యేకమైన కారణాలు చెబుతున్నారు. తరచూ హార్దిక్ పాండ్యా గాయపడడం నెగిటివ్ గా మారింది. రెండు రోజుల కింద మళ్ళీ మోకాలి గాయంతో హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమయ్యాడు. వన్డేలలో 10 ఓవర్లు వేసే ఫిట్నెస్ హార్దిక్ పాండ్యా దగ్గర లేదని ఇప్పటికే గౌతమ్ గంభీర్ తేల్చి పారేశారు. ఈ లెక్కను చూస్తే 2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్ లో హార్దిక్ పాండ్యా ఉండకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా స్థానంలో ప్రతి సిరీస్ లోను నితీష్ కుమార్ రెడ్డిని టీమిండియా యాజమాన్యం తీసుకుంటోంది. 2027 వన్డే వరల్డ్ కప్ లో కూడా నితీష్ కుమార్ రెడ్డి ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.