E-Paper
Advertisement

నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే – నివేదా పేతురాజ్!

నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే – నివేదా పేతురాజ్!
Advertisement

Nivetha pethuraj:  ‘మెంటల్ మది’లో అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నివేదా పేతురాజ్ (Nivetha pethuraj)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ఇండస్ట్రీలోకి రాకముందే 2015లో మిస్ ఇండియా యూఏఈ పోటీలో నెగ్గి కిరీటాన్ని సొంతం చేసుకుంది. తమిళ్, తెలుగు చిత్రాలలో నటిస్తూ మరింత పాపులారిటీ అందుకున్న ఈమె.. గత ఏడాది బిజినెస్ మెన్ తో నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి సిద్ధమవుతున్నాను అని చెప్పి, అభిమానులను సర్ప్రైజ్ చేసింది. కానీ అంతలోనే నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకోవడంతో ఇండస్ట్రీలో పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె.. మళ్లీ ఇప్పుడు త్రివిక్రమ్ (Trivikram ) దర్శకత్వంలో వెంకటేష్(Venkatesh ) హీరోగా నటిస్తున్న ఆదర్శ కుటుంబం ఏకే 47 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తీవ్రమైన మానసిక ఒత్తిడిని భరించాను..

ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన గత జ్ఞాపకాలను పంచుకుంటూ కన్నీటి పర్యంతమైంది. “2023లో నేను కొన్ని పొరపాట్లు చేశాను. ముఖ్యంగా నా వ్యక్తిగత జీవితంలో నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల తీవ్రమైన డిప్రెషన్, ఒత్తిడిని ఎదుర్కొన్నాను. అదే నేను నా జీవితంలో చేసిన తప్పు. అయితే ఆ కష్ట కాలం నుంచి బయటపడడానికి నాకు చాలా సమయమే పట్టింది. నిజానికి ఆ ఒత్తిడి కారణంగా సినిమాలను కూడా పూర్తిగా వదిలేద్దామని ఆలోచించాను. కానీ అదృష్టవశాత్తు పరిస్థితులు చక్కబడ్డాయి. మంచి అవకాశాలు తలుపు తట్టడంతో తిరిగి నేను ఇండస్ట్రీలోకి వచ్చి నటనపై దృష్టి పెట్టగలిగాను” అంటూ నివేదా తెలిపింది.

సర్జరీ చేయించుకోవాలనుకున్నాను.. కానీ..

Advertisement

కెరియర్ తొలినాళ్లలో నేను నా సొంత రూపంపై అసంతృప్తితో ఉండేదాన్ని. అందుకే నా పెదవులకు నేను సర్జరీ చేయించుకోవాలనుకున్నాను. అయితే ఇదే విషయంపై నేను డాక్టర్ని అడిగితే ఆయన నన్ను గట్టిగా హెచ్చరించారు. దాంతో నా ఆలోచన కూడా విరమించుకున్నాను.

ఆ హీరోయిన్లే నాకు స్ఫూర్తి..

ముఖ్యంగా ఇండస్ట్రీలో నిత్యామీనన్ , సాయి పల్లవి లాంటి హీరోయిన్లు ఎలాంటి సర్జరీలు లేకుండా తమ సహజ సౌందర్యంతోనే ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందుకే వారిని చూశాక నా రూపురేఖల గురించి నేను అనవసరంగా టెన్షన్ పడ్డానేమో అని గ్రహించాను . అందుకే సర్జరీలు లేకుండా నా సహజ సౌందర్యం తోనే ప్రేక్షకులను అలరించాలని నిర్ణయం తీసుకున్నాను.. అంటూ నివేదా పేతురాజు కామెంట్స్ చేశారు. మొత్తానికి అయితే ఈమె చేసిన కామెంట్లు ఆ స్టార్ హీరోయిన్లను దృష్టిలో పెట్టుకొని తన లైఫ్ను మార్చుకున్నాను అని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

also read: కల్కి 2’లో దీపికా స్థానంపై నాగ్ అశ్విన్ క్లారిటీ!

నివేదా పేతురాజు కెరియర్..

నివేదా పేతురాజు విషయానికి వస్తే.. విరాటపర్వం, దాస్ కా ధమ్కీ, బూ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు ఆదర్శ కుటుంబం ఏకే 47 సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే . అక్టోబర్ 2న ఈ సినిమాను మొదట విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల అక్టోబర్ 9కి వాయిదా వేశారు. ఈ సినిమాతో గట్టి కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

‘ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు’.. కృతి సనన్ షాకింగ్ పోస్ట్

‘ది ప్యారడైజ్’ పై కేటీఆర్ ట్వీట్…ప్రియదర్శి రియాక్షన్ ఇదే!

నా జూలియట్ ఎక్కడ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ పోస్ట్?

‘కల్కి 2’లో దీపికా స్థానంపై నాగ్ అశ్విన్ క్లారిటీ!

సినీ ఇండస్ట్రీలో విషాదం.. టాలీవుడ్ డైరెక్టర్ భార్య మృతి!

మిస్టర్ బీస్ట్‌తో రణ్‌బీర్.. ‘జై శ్రీరామ్’ అనిపించిన హీరో!

హిట్లర్ అనుకున్నా కానీ LKG పిల్లాడు..మోహన్ బాబు పై శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్

Big Stories

Advertisement
×