Intinti Ramayanam Today Episode june 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్య వాళ్ళ కోసం భోజనం తీసుకుని వస్తుంది.. అయితే మీ అమ్మ పంపిందా అని ఆరాధన వాళ్ళ అన్న కూడా నాకు వంట చేయడం రాదు కదా అమ్మే చేసింది మీరు తింటేనే నేను మీతో మాట్లాడతాను అని ఆరాధ్య అంటుంది.. మీరు తింటేనే నేను భోజనం చేస్తాను అని ఆరాధ్య మొండికేసి కూర్చుంటుంది. అయితే ఆరాధ్య మాటను కాదనలేక అక్షయ్ భానుమతి పార్వతి ముగ్గురు కూడా భోజనం చేస్తారు. వాళ్ళు భోజనం చేస్తారా లేదా అని కిటికీ నుంచి అవని చూస్తూ ఉంటుంది.. ఆరాధ్య తండ్రికి తినిపించడం చూసి అవని మురిసిపోతూ ఉంటుంది..
అమ్మ నానమ్మ అన్నయ్య ఎక్కడున్నారు అని కంగారుపడుతూ వెళ్ళాము. కానీ చివరికి చూస్తే వదిన వాళ్ళింటి ఎదురుగానే ఉన్నారని కమల్ అంటాడు. అవున్రా నేను కూడా చాలా కంగారు పడిపోయాను. కానీ అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉండడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానని శ్రీకర్ అంటాడు. పల్లవి అవనికి పార్వతి వాళ్ళు ఎక్కడ దగ్గర అవుతారో అని విడగొట్టాలని ఇంటికి వెళ్లి వేరే ఇంటికి వెళ్లాలని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే ఆరాధ్య కనిపించకపోవడంతో అవని వెతుక్కుంటూ ఉంటుంది. అందర్నీ కంగారుపడుతూ అవని అడుగుతుంది. ఆరాధ్య ఎక్కడికో వెళ్లిపోయింది కనిపించలేదు అని ఇందంతా వెతుకుతారు. బయట ఉన్న రాజేంద్రప్రసాద్ ని అవని ఆరాధ్య గురించి అడుగుతుంది.. అయితే ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదాం పదండి అని అందరూ టెన్షన్ పడుతుంటారు. అప్పుడే అక్షయ్ ఈ ఆరాధ్యని తీసుకురావడం చూసి ఆరాధ్య నీ దగ్గరికి ఎలా వచ్చింది అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. ఏమో నాకు తెలియదు నాన్న పొద్దున్నే చూసేలాగా నామీద పడుకుని ఉంది అని అక్షయ్ అంటాడు.
ఆరాధ్యను నువ్వు తీసుకొచ్చి నా దగ్గర పడుకోబెట్టి వెళ్ళావా అని అవని అక్షయ్ అడుగుతాడు.. నేను తీసుకురాలేదండి ఆరాధ్యనే వచ్చిందేమో అని అవని అంటుంది. ఇదొక కొత్త నాటకం మొదలు పెట్టావా..? ఎందుకు ఇన్ని డ్రామాలాడుతున్నావని అవనిని అక్షయ్ దారుణంగా తిడతాడు. కానీ అవని మాత్రం నాకేం తెలియదండి అని చెప్తుంది. రాజేంద్రప్రసాద్ అర్ధరాత్రి ఆరాధ్య నాన్న నాన్న అని కలవరియడం నేను విన్నాను. కూతురు ప్రేమను అర్థం చేసుకోకుండా ఇలా తిడతావా? అవనిని ఎందుకు తిట్టడం కనీసం నీకు ప్రేమ అనేది లేదా అని అరుస్తాడు. అయితే నాకు ప్రేమ లేకుండానే పెళ్లి చేసుకోను ఒక కూతురిని కనను అని అక్షయ్ సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు..
ఇలాంటి వాడి కోసం అమ్మ నువ్వు పరితపించేది అని రాజేంద్రప్రసాద్ అవని అరుస్తాడు. ఇక ఉదయం లేవగానే పల్లవి మీకోసం కొత్త ఇల్లు చూశాను అని చెప్పాను కదా అత్తయ్య చూశాను వెళ్దాం పదండి.. లగేజ్ మొత్తం సద్దేసేయండి అనేసి అడుగుతుంది.. అయితే అక్షయ్ అక్కడికి రాగానే పల్లవి మన కోసం కొత్త ఇల్లు చూసిందంట మనం వెళ్ళిపోదామా లగేజ్ తీసుకురానా అనేసి పార్వతి అడుగుతుంది.. కానీ అక్షయ్ మాత్రం అక్కడి నుంచి కదలడు. ఏమైందిరా ఎందుకు ఆగావు నీకు ఇష్టం లేదా బయటకి వెళ్లడం అని అంటుంది పార్వతి.
అవని అంటే నాకు కూడా కోపం అమ్మ నేను అవనితో కలుస్తానని మీరు అస్సలు అనుకోకండి.. నాకు నా కూతురు ఇప్పుడిప్పుడే దగ్గరవుతుంది. నా కూతుర్ని వదిలిపెట్టి నేను ఎలా వస్తానని అనుకుంటున్నావు అని అడుగుతాడు. భానుమతి వాడి కూతురు అంటే ఎంత ప్రాణమో తెలుసు కదా? వాడు కూతుర్ని వదిలిపెట్టి ఎలా వస్తాడు పల్లవి అని భానుమతి అంటుంది. వీళ్లు రివర్స్లో షాక్ ఇస్తారని అస్సలు ఊహించలేదు.. అయితే అవని స్కూల్ కి మీ నాన్నతో వెళ్ళు అని ఆరాధ్యను పంపిస్తుంది.
Also Read: బాలుకు చుక్కలు చూపించిన ప్రభావతి..పగోడికి కూడా కష్టం రాకూడదు..
ఆరాధ్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళుతుంది. చూశారా అత్తయ్య అవని ఎలా కూతురిని అడ్డుపెట్టుకొని బావగారిని తన వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు చేస్తుంది అని పుల్లలు పెడుతుంది. అక్షయ్ ని పిలుస్తారు.. ఏంటి ఆరాధ్య ఎలా వచ్చావు అంటే నువ్వు స్కూల్ కి తీసుకెళ్లాలి కదా నాన్న వెళ్దాం పద నడుచుకుంటూ వెళ్ళిపోదామని ఆరాధ్య అంటుంది. మీకు పని పాట లేదు కారు లేదని కూడా తెలిసి ఆరాధ్యను పంపించిందంటే అవని అక్క మిమ్మల్ని ఎగతాళి చేస్తుందని అర్థమవుతుంది బావగారు అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..