Ms Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings ) Captain మహేంద్ర సింగ్ ధోని (Ms Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా కు ఎన్నో విజయాలు అందించిన మహేంద్రసింగ్ ధోని…చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా ఐదు టోర్నమెంట్లు అందించాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోనీ పై తాజాగా సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. గతంలో మహేంద్ర సింగ్ ధోనీకి అలాగే, తమిళ హీరోయిన్ లక్ష్మీరాయ్ కి మధ్య సంబంధం ఉందని.. వాళ్ళ ఉదయం నుంచి జోరుగా చర్చ జరుగుతుంది.
Also Read: IPL 2025 – BCCI: ఐపీఎల్ 2025 కొత్త షెడ్యూల్.. ప్రతిరోజు రెండు మ్యాచ్ లు, 8 రోజుల్లోనే ఫినిష్
ధోని రిలేషన్ పై లక్ష్మీరాయ్ హాట్ కామెంట్స్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పై లక్ష్మీరాయ్ ( Raai Laxmi ) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని తో తనకు రిలేషన్ ఉందని… ఇప్పటికీ చాలా మంది వార్తలు వైరల్ చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. గతంలో జరిగిన విషయాలను ఇప్పుడు తవ్వితీస్తున్నారని ఆమె మండి పడ్డారు. ఇప్పటికీ ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ఈ వార్తలు బాగా వస్తున్నాయని… ఓ రేంజ్ లో రెచ్చిపోయారు హీరోయిన్ లక్ష్మీరాయ్.
తనకు పిల్లలు పుడితే… వాళ్లు తనను అడిగారా…? ధోనితో నీకేంటి సంబంధం అని నన్ను నిలదీస్తారు… వాళ్లకు నేను ఏం సమాధానం చెప్పాలి ? ఇకనైనా పిచ్చి రాతలు ఆపండి.. పిచ్చి ప్రచారం దూరం పెట్టండి అంటూ హీరోయిన్ లక్ష్మీరాయ్ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. దీంతో హీరోయిన్ లక్ష్మీరాయ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఐపీఎల్ ప్రారంభంలోనే ధోనితో లక్ష్మీరాయ్ రిలేషన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( IPL 2025) ప్రారంభం లోని మహేంద్రసింగ్ ధోని అలాగే లక్ష్మీరాయ్ మధ్య రిలేషన్షిప్ వార్తలు బయటకు వచ్చాయి. లక్ష్మీ రాయ్ ది తమిళనాడు. అంటే పక్కా చెన్నై సూపర్ కింగ్స్. అప్పుడు మహేంద్ర సింగ్ ధోనీనే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్. ఇంకేముంది ఆ సమయంలో లక్ష్మీరాయ్… మహేంద్రసింగ్ ధోని కి దగ్గర అయింది. 2010లో మహేంద్రసింగ్ ధోనీకి పెళ్లి కాగా అంతకంటే ముందు వీరిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ డగ్ అవుట్ కు కూడా మహేంద్రసింగ్ ధోనితో కలిసి వెళ్ళింది.
Also Read : IPL 2025 : ఐపీఎల్ 2025 ఎలిమినేట్..క్యాటరింగ్ చేసుకుంటున్న రాజస్థాన్, చెన్నై !
చెన్నై సూపర్ కింగ్స్ బస్సులోనే ప్రయాణించింది. అందుకే వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు మహేంద్ర సింగ్ ధోని డబ్బులన్నీ అప్పట్లో.. లక్ష్మీరాయ్ కాజేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ధోని నీ వాడుకొని చాలా… ఎంజాయ్ చేసిందట హీరోయిన్ లక్ష్మీరాయ్… కానీ ఇప్పుడు భిన్నంగా స్పందించి… మహేంద్ర సింగ్ ధోనీ ని దోషి చేసే ప్రయత్నం చేస్తోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.