E-Paper
Advertisement

మాన‌వ్ మ్యాజిక్, శ్రీలంక‌పై టీమిండియా విజ‌యం..అయినా WTCలో గిల్ సేన‌కు అన్యాయ‌మే !

మాన‌వ్ మ్యాజిక్, శ్రీలంక‌పై టీమిండియా విజ‌యం..అయినా WTCలో గిల్ సేన‌కు అన్యాయ‌మే !
Advertisement

IND VS SL :  శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అందరూ ఊహించినట్లుగానే శ్రీలంకపై భారీ పరుగుల తేడాతో టీమిండియా విజయాన్ని నమోదు చేసుకుంది. ఐదో రోజు వరకు కొనసాగిన ఈ తొలి టెస్ట్ లో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో అదరగొట్టింది టీమిండియా. ఈ క్రమంలోనే శ్రీలంకపై 165 పరుగుల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. రెండో ఇన్నింగ్స్ లో 372 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో శ్రీలంక బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. మాన‌వ్ సుతార్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్లు ప‌డ‌గొట్టిన త‌రుణంలోనే టీమిండియా అవ‌లీల‌గా విజ‌యం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో 1-0 లీడ్ సంపాదించ‌గ‌లిగింది టీమిండియా.

చ‌క్రం తిప్పిన మాన‌వ్ సుతార్.. శ్రీలంక‌పై విజ‌యం

గాలే వేదికగా శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య తొలి టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఐదవ రోజు వరకు కొనసాగిన ఈ మ్యాచ్ లో ఫలితం తేలింది. టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించిన నేపథ్యంలో శ్రీలంకపై 165 పరుగుల తేడాతో బిగ్ విక్టరీ నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదట టీమిండియా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ లో 462 పరుగులు చేసిన టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 193 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇటు శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 284 ప‌రుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌ లో 206 ప‌రుగుల‌కే కుప్పకూలింది. దీంతో లంక‌పై టీమిండియా బిగ్ విక్ట‌రీ న‌మోదు చేసుకుంది.

Advertisement

రెండు ఇన్నింగ్స్ లో 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన శ్రీలంక బ్యాటర్లు… చెత్త ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా మానవ్ సుతార్ 6 వికెట్లు పడగొట్టి, శ్రీలంక నడ్డి విరిచాడు. దీంతో 77 ఓవర్లు ఆడిన శ్రీలంక 206 పరుగులు చేసిన తర్వాత ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లలో సోనల్ 84 పరుగులు చేయగా, ధనుంజయ 59 పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాట‌ర్లు ఎవ‌రూ కూడా సరిగ్గా రాణించలేదు. దీంతో టీమిండియా గెలిచింది.

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

అయినా WTCలో గిల్ సేన‌కు అన్యాయ‌మే !

Advertisement

శ్రీలంకపై విజయం సాధించిన టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 53.33% పాయింట్లు సాధించుకుంది. కానీ ఇప్పటికీ ఐదో స్థానంలోనే టీమిండియా కొనసాగుతోంది. శ్రీలంకపై గెలిచినప్పటికీ తన స్థానాన్ని మెరుగు పరుచుకోలేక పోయింది టీమిండియా. అయితే శ్రీలంకపై మరో మ్యాచ్ గెలిచి వైట్ వాష్ చేస్తే, టీమిండియా 57.58 పాయింట్లు సాధిస్తుంది. అదే సమయంలో బంగ్లాదేశ్ పైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలవాలి.

అప్పుడు 55.56 పాయింట్లకు బంగ్లాదేశ్ దిగజారుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా నాలుగు స్థానానికి చేరుతుంది. అటు బంగ్లాదేశ్ ఐదవ స్థానానికి దిగజారుతుంది. అనంతరం న్యూజిలాండ్ తో జరిగే రెండు టెస్టులను కూడా టీమిండియా గెలిచి… బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా అద్భుతంగా ఆడాలి. తన తర్వాతి టెస్టుల్లో ఏడు గెలిస్తే, క‌చ్చితంగా WTCలో రెండో స్థానానికి టీమిండియా చేరుతుంది.

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

 

Related News

IPLలోకి తీసుకుంటాం, తొంద‌ర‌గా ఔట్ అవ్వు..లంక బ్యాట‌ర్‌ను ట్రాప్ చేసి జైస్వాల్

పాకిస్తాన్ జ‌ట్టు మాకు ఈకతో సమానం…3-0 తేడాతో వైట్ వాష్ చేస్తాం

ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ కాకపోతే రిటైర్మెంట్ ఇవ్వాల‌ని కోహ్లీ న‌న్ను అవ‌మానించాడు !

షాహీన్ అఫ్రిది హ్యాట్రిక్…నేషనల్ ఛాంపియన్స్ కప్ ఛాంపియ‌న్ గా పాకిస్తాన్ గోల్డ్

ఇంగ్లాండ్ అన‌గానే ప్యాంట్ త‌డుపుకున్నాడు..గాయం పేరుతో బాబ‌ర్ డ్రామాలు చేస్తున్నాడు!

VVS ల‌క్ష్మ‌ణ్ కు అగ్ని ప‌రీక్ష పెట్టిన బీసీసీఐ…తేడా వ‌స్తే, పోస్ట్ ఊస్టింగే?

రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేస్తాం

Big Stories

Advertisement
×