Shaheen Afridi Hat-trick: 2027 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ (2027 ODI World Cup Trophy) లక్ష్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) తాజాగా నేషనల్ ఛాంపియన్స్ టోర్నమెంట్ ( National Champions Cup 2026-27) నిర్వహించింది. గత వారం రోజుల కిందట ప్రారంభమైన ఈ టోర్నమెంట్ నిన్నటితో ముగిసింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన షాహిన్ అఫ్రిది (Shaheen Afridi Hat-trick ) ప్రాతినిధ్యం వహించిన పాకిస్తాన్ గోల్డ్ జట్టు ఇందులో ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో జట్టును ముందుండి నడిపించాడు కెప్టెన్ షాహిన్ అఫ్రిది. హ్యాట్రిక్ వికెట్లు ( Shaheen Afridi Hat-trick ) తీయడమే కాకుండా, తన కెప్టెన్సీ ప్రతాపం ఏంటో చూపించాడు. ఈ క్రమంలో ఫైనల్స్ గెలిచి చాంపియన్ అయింది పాకిస్తాన్ గోల్డ్ టీం.
నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026 టోర్నమెంట్ లో ( National Champions Cup 2026-27) భాగంగా ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ గోల్డ్ వర్సెస్ పాకిస్తాన్ గ్రీన్స్ ( Pakistan Gold vs. Pakistan Greens) జట్ల మధ్య జరిగింది. అయితే ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ గోల్డ్ నిర్మిత 50 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో 340 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ గ్రీన్స్ టీమ్ చెత్త ప్రదర్శన కనబరిచి 239 పరుగులు చేసి కుప్పకూలింది. ఈ క్రమంలో పాకిస్తాన్ గ్రీన్స్ జట్టు పైన పాకిస్తాన్ గోల్డ్ 101 పరుగుల తేడాతో అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది.
నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026 టోర్నమెంట్ లో ( National Champions Cup 2026-27) భాగంగా ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ గోల్డ్ వర్సెస్ పాకిస్తాన్ గ్రీన్స్ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గోల్డ్ కెప్టెన్ షాహిన్ అఫ్రిది ( Shaheen Afridi) మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది. మొత్తంగా 8.3 ఓవర్లు సంధించిన షాహిన్ అఫ్రిది, 36 పరుగులు తీసి ఏడు వికెట్లు పడగొట్టాడు. డొమెస్టిక్ వన్డే టోర్నీ ఫైనల్ లో ఇది అత్యుత్తమ రికార్డు గా నిలిచింది.
తన కెప్టెన్సీలో పాకిస్తాన్ గోల్డ్ జట్టును ఛాంపియన్ గా నిలిపిన షాహిన్ అఫ్రిది ని ఉద్దేశించి మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతడినే వన్డే కెప్టెన్ గా కొనసాగించాలని డిమాండ్లు కూడా చేస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో షాహిన్ అఫ్రిది సారధ్యంలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు బరిలోకి దిగాలని పేర్కొంటున్నారు. బాబర్ ఆజం ( Babar Azam) కంటే షాహిన్ అఫ్రిది బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో బాబర్ ఆజం ఆశలు నిరాశగానే మిగిలిపోనున్నాయి.
Shaheen Shah Afridi hat-trick!! 🔥 pic.twitter.com/Bce78JCO0i
— PCT Replays 2.0 (@ReplaysPCT) August 18, 2026