E-Paper
Advertisement

ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ కాకపోతే రిటైర్మెంట్ ఇవ్వాల‌ని కోహ్లీ న‌న్ను అవ‌మానించాడు !

ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ కాకపోతే రిటైర్మెంట్ ఇవ్వాల‌ని కోహ్లీ న‌న్ను అవ‌మానించాడు !
Advertisement

Yuvraj Singh On Virat Kohli: టీమిండియా మాజీ డేంజర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో ఏళ్ల పాటు టీం ఇండియాకు సేవలు అందించాడు. 2007, 2011 వరల్డ్ కప్ టీమిండియా గెలవడం వెనుక యువరాజ్ కృషి ఎంతో ఉంది. అయితే అలాంటి యువరాజ్ సింగ్ ప్రస్తుతం రిటైర్మెంట్ తీసుకొని జాలిగా లైఫ్ గడిపేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువరాజ్ సింగ్.. రవి శాస్త్రి, అప్పటి కోచ్ విరాట్ కోహ్లీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ పెట్టిన కండిషన్స్ వల్ల తాను టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇవ్వలేకపోయానని బాంబు పేల్చారు యువరాజ్ సింగ్. ఫిట్నెస్ ఉంటేనే టీమిండియాలోకి రావాలని.. లేకపోతే రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని ముఖం మీదే తేల్చి చెప్పార‌న్నారు. దీంతో యువరాజ్ సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ కాకపోతే రిటైర్మెంట్ ఇవ్వాల‌ని న‌న్ను అవ‌మానించారు !

2018 సమయంలో టీమిండియాలోకి పునరాగమనం చేసేందుకు యువ రాజ్ సింగ్ విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉండగా, రవిశాస్త్రి హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ కోసం యువరాజ్ సింగ్ చాలా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో నువ్వు ఫిట్నెస్ టెస్ట్ పాస్ కాకపోతే రిటైర్ అవ్వాల్సిందేనని యువరాజు సింగ్ కు తేల్చి చెప్పారట రవి శాస్త్రి అలాగే విరాట్ కోహ్లీ.

Advertisement

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

సీనియర్ ప్లేయర్ అన్న గౌరవం కూడా తనకు ఇవ్వకుండా దారుణంగా ఇద్దరు వ్యవహరించారని యువరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కానీ తాను పట్టుదలతో శ్రమించి ఆ ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయినప్పటికీ జట్టు ఎంపికపై మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి సానుకూల సమాధానం రాలేదని ఎమోషనల్ అయ్యారు. జాతీయ జట్టు కోసం ఎన్నో ఏళ్లు ఆడి… రెండు వరల్డ్ కప్ అందించిన తనకు సరైన గుర్తింపు చివరిలో దక్కలేదని వెల్లడించారు. విరాట్ కోహ్లీ వల్ల తనకు అన్యాయం జరిగిందని పరోక్షంగా వ్యాఖ్యానించారు.

ధోనిని సంప్రదించినా ప్రయోజనం దక్కలేదు

Advertisement

టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు మహేంద్రసింగ్ ధోనిని కూడా సంప్రదించినట్లు యువ‌రాజ్ సింగ్ వెల్లడించారు. కానీ 2019 ప్రపంచ కప్ రేస్‌ నేపథ్యంలో యువ క్రికెటర్లకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారని ధోని తనకి చెప్పాడని క్లారిటీ ఇచ్చారు. సీనియర్లను పక్కకు పెడుతున్నారని.. తానేమి చేయలేదని ధోని కుండ బద్దలు కొట్టి చెప్పారట. ఇక చేసేదేమీ లేక యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ఇచ్చినట్లు క్రీడా విశ్లేష‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఇది ఇలా ఉండ‌గా, యువరాజ్ సింగ్ 2019, జూన్ 10వ తేదీన అంత‌ర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చాడు.

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

 

Related News

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

Big Stories

Advertisement
×